Share News

ఉచిత ప్రయాణాల మోత

ABN , Publish Date - Aug 18 , 2025 | 12:36 AM

వరుస సెలవులు పూర్తి కావడం.. ఉచిత బస్సు ప్రయాణాలు అందుబాటు లోకి రావడంతో ఆదివారం మహిళలతో బస్సులు కిటకిట లాడాయి.

ఉచిత ప్రయాణాల మోత
ముదినేపల్లి–గుడివాడ బస్సులో మహిళలు

బస్సులలో మహిళల రద్దీ

ఏలూరు, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): వరుస సెలవులు పూర్తి కావడం.. ఉచిత బస్సు ప్రయాణాలు అందుబాటు లోకి రావడంతో ఆదివారం మహిళలతో బస్సులు కిటకిట లాడాయి. పెళ్లిళ్లు, శుభకార్యాలు కూడా పనిలో పనిగా కానిచ్చేశారు. కుటుంబ సమేతంగా బాలికల ఆధార్‌ కార్డులు కవరులో పెట్టుకుని ప్రయాణాలు చేసేశారు. కొందరు కండక్టర్లు ఆధార్‌కార్డు ఒరిజినల్‌ తెచ్చుకోకపోతే ఎలా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. మహిళలు ఎడాపెడా ఆదివారం రాకపోకలతో బస్టాండలన్నీ సందడి గా మార్చేశారు. పల్లెవెలుగు బస్సుల్లో ప్రయాణిలకు తాకిడి పెరిగింది. తొలి రోజు 2,781 ఉచిత ప్రయాణాలు చేయగా, రెండోరోజు శనివారం 11,124 మంది రాకకపో కలు సాగించారు. ఆదివారం ఈ సంఖ్య రెట్టింపైంది. రాత్రి 7గంటల సమయానికి అధికారులరు అందిన సమాచారం ప్రకారం 26,729 మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారు. జీరో టిక్కెట్‌ రూపంలో ఆర్టీసీ భారం రూ.11.31 లక్షలు తేల్చారు.

విలీన మండలాలకు స్ర్తీ శక్తి

ఏలూరు, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): విలీన మండ లాలు, గ్రామాల ప్రయాణిలకు స్ర్తీ శక్తి పథకం వర్తింప జేస్తున్నట్టు ఏలూరు డీపీటీవో షేక్‌ షబ్నం తెలిపారు. ‘వీరికి ఉచితం లేదట’ శీర్షికన ఆంధ్రజ్యోతిలో ఆదివారం ప్రచురితమై కథనానికి ఏలూరు జిల్లా ప్రజా రవాణా అధికారి షబ్నం స్పందించారు. జంగారెడ్డిగూడెం డిపో పరిధిలోని పోలవరం ముంపు మండలాల ప్రయాణిలకు స్త్రీ శక్తి పథకం వర్తింపజేస్తున్నామని అన్నారు. ఈ మేర కు తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం, అశ్వారావుపేట ప్రాంతాలకు వెళుతున్న బస్సులను భద్రాచలం–రాజ మండ్రి, భద్రాచలం– రేపాకగొమ్ము సర్వీసులను ఎటపాక వరకు పొడిగించామన్నారు. భద్రాచలం వెళ్లే ఈ రెండు సర్వీసులను ఆంధ్రప్రదేశ్‌లోని ఎటపాక వరకు పొడిగి స్తూ ఎన్‌క్లేవ్‌ (ఏపీలో ప్రారంభమయ్యి మధ్యలో తెలం గాణ వచ్చి మళ్లీ ఆంధ్రా రూట్‌ రావడం) రూట్‌గా మార్చడం ద్వారా సదరు సర్వీసు మార్గంలోని కుక్కునూ రు, వేలేరుపాడు (విలీన మండలాలు) గ్రామాల ప్రజల కు స్ర్తీ శక్తి పథకం పరిధిలోకి తీసుకొచ్చినట్టు షబ్నం ఒక ప్రకటనలో తెలిపారు. అంతరాష్ట్ర సర్వీసైన అశ్వారావు పేట షటిల్‌ సర్వీసును జీరో టికెట్‌గా మార్పు చేశామ న్నారు. ఇది జంగారెడ్డిగూడెం – జీలుగుమిల్లి సర్వీస్‌గా కొనసాగుతుందన్నారు. ఈ మార్గంలోని ఏపీ గ్రామ ప్రయాణిలకు స్త్రీ శక్తి పరిధిలోకి వస్తారన్నారు.

Updated Date - Aug 18 , 2025 | 12:36 AM