Share News

బస్సులు కిటకిట

ABN , Publish Date - Aug 19 , 2025 | 12:50 AM

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్త్రీశక్తి పథకంలో మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం ద్వారా విశేష లబ్ధి చేకూరుతోంది.

బస్సులు కిటకిట

ఉచిత ప్రయాణంతో మహిళలకు విశేష లబ్ధి

రోజు రోజుకు పెరుగుతున్న మహిళలు

కళాశాల విద్యార్థినుల ఆనందం

బస్టాప్‌లలో ఆగని బస్సులు

రాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో వివాదాలు

పలుచోట్ల మరమ్మతులతో నిలిచిన బస్సులు

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్త్రీశక్తి పథకంలో మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం ద్వారా విశేష లబ్ధి చేకూరుతోంది. పథకం ప్రారంభించిన నాటి నుంచి రోజు రోజుకు ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. రద్దీకి అనుగుణంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అదే సమయంలో సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో బస్టాప్‌ల వద్ద బస్సులు ఆగకుండా వెళ్లిపోతున్నాయి. పోలవరం ప్రాంతంలో బస్సులు మరమ్మతులతో నిలిచిపోతున్నాయి. తెలంగాణ సరిహద్దు గ్రామాల్లో పలు సమస్యలతో కండక్టర్‌తో మహిళలు వాగ్వాదానికి దిగుతున్నారు. తెలంగాణ పరిధి గ్రామంలో బస్సు ఎక్కిన ఇక్కడి మహిళలు టికెట్‌ తీసుకోవాల్సిందేనని కండక్టర్లు చెప్పడంతో సమస్యలు వస్తున్నాయి.

భీమవరం టౌన్‌, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ బస్సులలో సోమవారం అనూహ్య రద్దీ కనిపించి. గత మూడు రోజలుగా కంటే కిక్కిరిసిన ప్రయాణికులతో బస్సులు వెళ్లాయి. పల్లె వెలుగు ఆల్ర్టా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులల్లో ఉచిత ప్రయాణం మహిళలకు విశేషంగా లాభిస్తోంది. మూడు రోజులుగా పశ్చిమ గోదావరి జిల్లాలో 2,70,858 మంది ప్రయాణించారు. టిక్కెట్‌పై 1,65,042 మంది ప్రయాణించగా 1,05,816 మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారు. మూడు రోజులకు ఆర్టీసీకి టిక్కెట్‌ ఆదాయం రూ. 88,96,713 అయితే రూ.36,37,510 ఉచిత ఫేర్‌ టిక్కెట్‌ విలువ కావడం విశేషం.

బస్‌ కాంప్లెక్స్‌లలో రద్దీ

భీమవరం పట్టణంతో పాటు జిల్లాలో పలు బస్‌ కాంప్లెక్స్‌లు సోమవారం ఉదయంనుంచి రద్దీగా కనిపించాయి. విద్యార్థులతోపాటు వివిధ ప్రాంతాలకు వెళ్లేవారు అధికంగా కనిపించారు. మహిళలు సంఖ్యకూడా బాగా పెరిగింది. బస్సులు ప్లాట్‌ ఫారం వద్ద పెడితే చాలు క్షణంలో ఫుల్‌ అయిపోతోంది. మార్గమధ్యలో ప్రయాణికులను ఎక్కించుకునే పరిసిఽ్ధతి ఉండ డం లేదు. సాయంత్రం వరకు ఇదే పరిస్థితినెలకొంది.

అధికారుల పరిశీలన

బస్‌ కాంప్లెక్స్‌లలో ప్రయాణికుల రద్దీని క్రమబద్దీకరించేందుకు ప్రత్యేక సిబ్బందిని నియమించారు. బస్సులను సక్రమంగా పంపించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. సాయంత్రం వేళ విద్యార్థులకు ఇబ్బందులు రాకుండా బస్సులను పంపించేలా చర్యలు చేపట్టారు.

బస్సులు ఏర్పాటుచేయాలి

ఆకివీడు: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఆర్టీసీ బస్టాండ్‌లు, బస్సులు కళకళలాడుతున్నాయి. గతంలో మహిళు అధికంగా ఆటోలో వెళ్లేవారు. స్త్రీశక్తి పథకం ద్వారా ఆర్టీసీలో ఉచితంగా వెళ్లేందుకు అవకాశం కల్పించడంతో ఆర్టీసీ బస్టాండులకు చేరుతున్నారు. మహిళలు, కళాశాల విద్యార్థులు ఉచిత ప్రయాణంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆకివీడు బస్టాండ్‌లో కంట్రోలర్‌ను ఏర్పాటు చేశారు. ఆకివీడు నుంచి గుడివాడ, విజయవాడ వెళ్లేందుకు బస్సులు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని మహిళా ప్రయాణికులు వాపోతున్నారు. ఆర్టీసీ ఉన్నతధికారులు సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

ఆపండి..

పోలవరం: ఉచిత ఆర్టీసీ ప్రయాణం మహిళలు విరివిగా వినియోగి స్తున్నారు. సోమవారం చాలా చోట్ల బస్సులలో మహిళా ప్రయాణికుల రద్దీ పెరిగింది. రద్దీ అధిగ మించడానికి బస్సులను నిర్దేశిత ప్రాంతాలలో నిలపకుండా బస్టాప్‌లకు కొద్దిపాటి దూరంలో ఆపి ప్రయాణికులను దించి వెళుతున్నారు. మహిళలు, సాధారణ ప్రయాణికులు సైతం ఆర్టీసి సిబ్బంది తీరుపై మండిపడుతున్నారు. పోలవరం నుంచి సోమవారం బయల్దేరిన రాజమహేంద్రవరం డిపో బస్సు తాళ్లపూడి మండలం ధర్మవరంలో మరమ్మ తులకు గురై నిలిచిపోయింది. జోరున కురుస్తున్న వర్షంలో ప్రయాణికులు బస్సులు, ఆటోల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. రాజమహేం ద్రవరం నుంచి పోలవరం బయల్దేరిన బస్సు కొవ్వూరు బస్టాండులో నిలిచిపోవడంతో ప్రయాణి కులను దింపి మరమ్మతులు చేశారు.

సరిహద్దు గ్రామాల్లో ఉచితం వర్తించదా?

చింతలపూడి: ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఎక్కడికైనా ఉచిత ప్రయాణం చేయవచ్చు. కానీ తెలంగాణ–ఆంధ్ర సరిహద్దు మండలాల్లో మాత్రం అడ్డంకులు ఎదురవుతున్నాయి. సరిహద్దు గ్రామాల మహిళలు ఆంధ్రా ప్రాంతంలో తిరిగినా ఉచితం వర్తించదని కండక్టర్లు చెప్పడంతో మహిళలు వాగ్వివాదానికి దిగుతున్నారు. ఏలూరు డిపోకు చెందిన బస్సు సోమవారం ఉదయం సత్తుపల్లి వెళ్లి గురుభట్లగూడెం రాగా అక్కడ కొందరు మహిళలు చింతలపూడి మండలంలోని మల్లాయిగూ డెం రావడానికి బస్సు ఎక్కారు. మీకు ఈ బస్సు వర్తించదంటూ చెప్పడంతో ప్రభుత్వం ఇచ్చినా మీరు అడ్డుపడడం సరికాదని మహిళలు కండక్టర్‌తో వాగ్వి వాదానికి దిగారు. మల్లాయిగూడెం గ్రామానికి చెందిన నాయకుడు మట్టా సత్యనారాయణ ఇది ఏలూరు డిపో కు చెందిన బస్సు ఆంధ్రా ప్రాంతంలోని గ్రామాలకు వెళ్లడానికి అభ్యంతరం ఏమిటని ప్రశ్నించినా వీల్లేదం టూ మహిళలకు రూ.20 టికెట్‌ కొట్టడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకానికి కండక్టర్లు అడ్డుప డడం సరికాదని వ్యాఖ్యానించారు. పల్లె వెలుగు సర్వీసు అయిన తెలంగాణ–ఆంధ్ర మధ్య రాకపోకలతో అంత ర్రాష్ట్ర సర్వీసుగా భావిస్తున్నారనుకుంటే అదే బస్సులో చింతలపూడి నుంచి ఏలూరుకు ఉచిత టికెట్‌ ఇవ్వడం గమనార్హం. ఒకే మండలంలో వేర్వేరు గ్రామా ల్లో ఉచిత టిక్కెట్‌పై ద్వంద్వ విధానాలతో ప్రజలు ఆశ్యర్చపోతున్నారు. గురుభట్లగూడెం నుంచి మల్లాయి గూడెం గ్రామానికి డబ్బు చెల్లించాల్సిందేనని చెప్పడం విడ్డూరంగా ఉందని మహిళలు వాపోయారు. ఇదే సంఘటన తిరిగి మధ్యాహ్నం వేళ మరో ఏలూరు డిపోకు చెందిన బస్సు కండక్టర్‌ పోతునూరు నుంచి లింగగూడెం గ్రామం వెళ్లేందుకు మహిళలకు అభ్యంత రం వ్యక్తం చేశారు. సరిహద్దులోని గ్రామాలకు ఈ ఉచిత ప్రయాణం వర్తించదా? ఉన్నతాధికారులు ఈ సమస్య పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు. అసలే చింతలపూడి మండలంలో మూడు వంతులు గ్రామాలకు బస్సు సర్వీసులు లేవు. వచ్చే బస్సులు సగం తెలంగాణ ప్రాంతానివి. ఉన్న ఈ కొద్ది బస్సుల్లో కూడా మహిళలకు అవకాశం లేకపోవడం విచిత్రంగా ఉందని వాపోయారు.

Updated Date - Aug 19 , 2025 | 12:50 AM