Share News

రైట్‌.. రైట్‌..

ABN , Publish Date - Aug 14 , 2025 | 12:55 AM

ఆర్టీసీ బస్సుల్లో మహిళ ల ఉచిత ప్రయాణానికి అంతా సిద్ధమైంది.

రైట్‌.. రైట్‌..

రేపటి నుంచే స్త్రీ శక్తి.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

జిల్లాలో 233 పల్లె వెలుగు,

ఆలా్ట్ర పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సులు

ప్రభుత్వ గుర్తింపు కార్డు చూపించి మహిళలు ఫ్రీగా ప్రయాణం చేయవచ్చు

రద్దీకి అనుగుణంగా బస్సుల ఏర్పాటు చేస్తామంటున్న అధికారులు

భీమవరం టౌన్‌, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ బస్సుల్లో మహిళ ల ఉచిత ప్రయాణానికి అంతా సిద్ధమైంది. స్ర్తీ శక్తి పథకం కింద ఈ నెల 15వ తేదీ నుంచి జిల్లాలోని 233 పల్లె వెలుగు, ఆల్ర్టా పల్లె వెలు గు, ఎక్స్‌ ప్రెస్‌ సర్వీసుల్లో బాలికలు, మ హిళలు, ట్రాన్స్‌జెండర్ల ఉచితంగా ప్రయా ణించవచ్చు. తాము ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారమన్న గుర్తింపు కార్డులైన ఆధార్‌, ఓటరు, ప్రభుత్వం జారీ చేసిన కార్డులు చూపించాలి. అయితే నాన్‌ స్టాప్‌, అం త రాష్ట్ర, కాంట్రాక్ట్‌ క్యారేజ్‌, ప్యాకేజీ టూర్‌ బస్సుల్లో మాత్రం ఉచిత ప్రయాణాలు వర్తించవు. సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌, అల్ర్టా డీలక్స్‌, సూపర్‌ లగ్జరీ, స్టార్‌ లైన్‌, ఇంద్ర, ఏసీ బస్సుల్లోనూ కుదరదు.

జిల్లాలో భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, నరసాపురం డిపోలు ఉన్నాయి. ఇక్కడ 184 పల్లె వెలు గు, 19 ఆలా్ట్ర పల్లె వెలుగు, 20 ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులు ఉన్నాయి. ఈ బస్సుల్లో ప్రతీ రోజు సగటున 78 వేల మంది ప్రయాణికులు ప్రయాణాలు చేస్తు న్నారు. 15 రోజుల ప్రయాణికుల రద్దీని పరిగణనలోకి తీసుకుని జిల్లాలో ప్రతీ రోజు సగటు ప్రయాణీకుల వివరాలను ప్రభుత్వానికి సమర్పించారు. ప్రస్తుత లెక్కల ప్రకారం జిల్లా లో 68 శాతం మంది మ హిళలు ప్రయాణిస్తున్నారు. ఉచిత బస్సుల వల్ల అదనంగా వీరు మరో 15 శాతం పెరిగే అవకాశం ఉంది. ఆక్యుపెన్సీ 100 శాతం పెరగనుంది. మహిళా ప్రయాణికుల సంఖ్య 55 వేలకు చేరుకుంటుందని అఽధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లా నుంచి రాజమహేంద్రవ రం, ఏలూరు, రావులపాలెం, రాజోలు, జంగారెడ్డిగూ డెం, మచిలీపట్నం, విజయవాడ, అమలాపురం తది తర ప్రాంతాలకు ప్రయాణించవచ్చు. భీమవరం, నరసాపురం డిపోల్లో పల్లె వెలుగు, ఆలా్ట్ర పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌లు ఉన్నాయి. తణుకు, తాడేపల్లిగూడెంలో కేవలం పల్లె వెలుగు, ఆలా్ట్ర పల్లె వెలుగులే ఉన్నాయి.

రూ.15 లక్షలకు పడిపోనున్న ఆదాయం

ప్రస్తుతం రోజుకు గరిష్టంగా జిల్లా నుంచి నాలు గు డిపోల ద్వారా 35 లక్షల ఆదాయం వస్తోంది. ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఇది 15 లక్షలకు పడి పోనుంది. ఆర్టీసీ కాంప్లెక్స్‌లు, బస్‌స్టాప్‌లు, మరుగుదొడ్లు వంటి వసతులను పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. బస్సు లకు మరమ్మతులు చేస్తున్నారు. ఆర్టీసీ ప్రధాన బస్‌ కాంప్లెక్స్‌లతో పాటు బస్టాప్‌ల వద్ద రద్దీని దృష్టిలో ఉంచుకుని ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందిని నియమించనున్నారు. ఆకివీడు, ఉండి, వీరవాసరం, మార్టేరు, అత్తిలి, పిప్పర, గణపవరం, పెనుగొండ, ప్రాంతా ల్లో వీరి ఏర్పాటుచేసి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపడుతున్నారు.

ఫ్రీ బస్సులు సిద్ధం

ప్రజా రవాణాధికారి వరప్రసాద్‌

ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్న స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణానికి అవసరమైన బస్సు లను సిద్ధం చేసినట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి ఎన్‌.వి.ఆర్‌. వరప్రసాద్‌ తెలిపారు. బుధవారం ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘జిల్లాలో భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, నరసాపురం డిపోల్లో 298 బస్సులు ఉన్నాయి. వీటిలో 184 పల్లె వెలుగు, 19 అలా్ట్ర పల్లె వెలుగు, 20 ఎక్స్‌ప్రెస్‌లు మొత్తం 223 బస్సులను సిద్ధం చేశాం. వీటిల్లో 45 వేల మంది మహిళలు ప్రయాణిస్తున్నారు. ఉచిత ప్రయాణాలతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రభుత్వ గుర్తింపు కార్డుతో వచ్చిన రాష్ట్ర మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్లు ఎక్కడికైనా ఉచితంగా బస్సు ప్రయాణం చేయవచ్చు.రద్దీని గమనించి ఎప్పటికప్పుడు బస్సులు పంపే విధంగా చర్యలు తీసుకుంటాం. ఉచిత బస్సు ప్రారంభించిన తర్వాత ప్రయాణికుల రద్దీ దృష్ట్యా బస్సు ట్రిప్పులను పెంచుతాం. బస్‌ కాంప్లెక్స్‌లల్లో ప్రయాణికులకు కావాల్సిన కుర్చీలు, ఫ్యాన్లు, టాయిలెట్‌లను ఏర్పాటు చేశాం’ అని తెలిపారు. సమావేశంలో భీమవరం ట్రాఫిక్‌ సిఐ సురేష్‌, బాల సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 14 , 2025 | 12:55 AM