చీటీల పేరిట రూ.రెండున్నర కోట్లకు టోకరా..!
ABN , Publish Date - Oct 04 , 2025 | 12:56 AM
నూజివీడుకు చెందిన సిరిగిరి వెంకటేశ్వరరావు(మోషే) కుల సంఘాన్ని అడ్డు పెట్టుకుని చీటీల పేరుతో తమను మోసం చేశాడంటూ పలువురు బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
ఐపీ నోటీసులు పంపడంతో
పోలీసులను ఆశ్రయించిన బాధితులు
నూజివీడు టౌన్, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి):నూజివీడుకు చెందిన సిరిగిరి వెంకటేశ్వరరావు(మోషే) కుల సంఘాన్ని అడ్డు పెట్టుకుని చీటీల పేరుతో తమను మోసం చేశాడంటూ పలువురు బాధితులు పోలీసులను ఆశ్రయించారు. వారు తెలిపిన వివరాలివి.. బుడగ జంగా ల కార్యదర్శిని అంటూ మోషే ఉమ్మడి కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలోని నూజివీడు, హనుమాన్‌జంక్షన్, ధర్మాజీగూడెం, బంటుమిల్లి, కుక్కునూరు, కొత్తపల్లి తదితర ప్రాంతాల్లోని తమ కులస్తులను కలిసి.. మన వారి లాభం కోసమే తాను చిట్‌ఫండ్ నిర్వహిస్తున్నానని చెప్పాడు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తాను అండగా ఉంటానని, ఎప్పుడు కావాలంటే అప్పుడు చిట్ పాడుకుని తీసుకోవచ్చని, డివిడెండ్ ఎక్కువ వస్తుందని నమ్మబలికాడు. తన వద్ద చిట్ వేస్తే ఆ సొమ్ము మీ ఇంటిలో వున్నట్టేనని చెప్పుకొచ్చాడు. అతని మాటలు నమ్మి పెద్ద సంఖ్యలో చీటీలు (మిగతా 8వ పేజీలో)