Share News

ఆర్డీవో కార్యాలయం వద్ద రైతుల ధర్నా

ABN , Publish Date - Sep 23 , 2025 | 12:38 AM

ఎర్రకాలువ జలాశయం భూముల్లో అక్రమ సాగుకు ప్రయత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జంగారెడ్డిగూడెం ఆర్డీవో కార్యా లయం వద్ద సోమవారం రైతులు ధర్నా నిర్వహించారు.

ఆర్డీవో కార్యాలయం వద్ద రైతుల ధర్నా
ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తున్న రైతులు

జంగారెడ్డిగూడెం,సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): ఎర్రకాలువ జలాశయం భూముల్లో అక్రమ సాగుకు ప్రయత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జంగారెడ్డిగూడెం ఆర్డీవో కార్యా లయం వద్ద సోమవారం రైతులు ధర్నా నిర్వహించారు. ఆర్డీవో ఎంవి.రమణకు వినతి పత్రం సమర్పించారు. అనంతరం రైతు, ఎ.పోలవరం మాజీ సర్పంచ్‌ బుద్దాల సత్యనారాయణ విలేకరులతో మాట్లాడుతూ సన్న,చిన్నకారు రైతులు ఎర్ర కాలువ జలాశయం నిర్మాణానికి అతి తక్కువ ధరకే భూ ములు ఇచ్చారన్నారు. ఒక పంట మునుగుతుందని, రెండవ పంటకు తమ భూములను దున్నకుండా సర్వే తోటలు, కొబ్బరి,పామాయిల్‌ తోటలు వేసుకుంటే ఆదాయం వస్తుం దని అప్పటి ఉమ్మడి జిల్లా జేసీ జంగారెడ్డిగూడెం ఆర్డీవో కార్యాలయంలో రైతుల సమావేశంలో హామీ ఇచ్చినట్లు తెలిపారు. అయితే ఇటీవల కొందరు కమ్యూనిస్టు నాయకులమని చెప్పి ప్రాజెక్టు భూముల్లోకి అక్రమంగా ప్రవేశించి, భూములు ఇచ్చిన రైతులను భయపెట్టి సాగుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. అడ్డుపడిన రైతులపై కేసులు పెడతా మని బెదిరిస్తున్నట్టు తెలిపారు. కాగా డీఎస్పీతో మాట్లాడి రైతులకు న్యాయం జరిగేలా చూస్తానని ఆర్డీవో హామీ ఇచ్చినట్టు సత్యనారాయణ తెలిపారు. ఇరిగేషన్‌ కార్యాలయంలో ఇరిగేషన్‌ డీఈ సునీతను రైతులు కలిసి తమకు న్యాయం చేయాలని కోరారు. జంగారెడ్డిగూడెం మండలం చిన్నవారిగూడెం, ఎ.పోలవరం, మధ్యాహ్నపువారి గూడెం, టి.నరసాపురం మండలానికి చెందిన రైతులు పాల్గొన్నారు.

Updated Date - Sep 23 , 2025 | 12:38 AM