కొల్లేరు ప్రజల మనోభావాలను సుప్రీంకు నివేదిస్తాం
ABN , Publish Date - Oct 08 , 2025 | 12:17 AM
కొల్లేరు ప్రాంత ప్రజల మనోభావాల కు అనుగుణంగా వారికి న్యాయం చేసే కోణంలో ప్రభుత్వానికి నివేదించి, తదుపరి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర అటవీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాం తిలాల్ దండే అన్నారు.
అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే
నేడు వాదనలు వినిపించనున్న రాష్ట్ర ప్రభుత్వం..
ఏలూరు, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): కొల్లేరు ప్రాంత ప్రజల మనోభావాల కు అనుగుణంగా వారికి న్యాయం చేసే కోణంలో ప్రభుత్వానికి నివేదించి, తదుపరి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర అటవీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాం తిలాల్ దండే అన్నారు. అటవీ, పర్యావరణ శాఖల ప్రత్యేక కార్యదర్శి శరవ ణన్‌తో కలిసి కలెక్టరేట్‌లో కొల్లేరు అంశంపై మంగళవారం సమీక్షా సమా వేశం నిర్వహించారు. పర్యావరణవేత్త మృత్యుంజయరావు సుప్రీం కోర్టులో వేసిన ప్రజా ప్రయోజన వాజ్యం(పిల్) వేసిన నేపథ్యంలో బుధవారం సుప్రీం కోర్టులో ప్రభుత్వం వాదనలు వినిపించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో శాఖల వారీగా అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దండే సమీక్షించారు. గత వరదల సమయంలో బుడమేరు నుంచి ఎక్కువ వరద నీరు కొల్లేరుకు చేరి నా యుద్ధప్రాతిపదికన నీటిని మరలించేందుకు చర్యలు చేపట్టినట్లు ఆయ న వివరించారు. కొల్లేరు ప్రజల మనోభావాలను సుప్రీం కోర్టుకు ప్రభుత్వం వివరిస్తుందన్నారు. కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో 10 మండలాల్లో కొల్లేరు ప్రాంతం ఉందని, ఇప్పటి వరకు చేపట్టిన అభివృద్ధి పనులను వివరించారు. సమావేశంలో ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, ఆర్డీవో అచ్యుత్ అంబరీష్, అటవీశాఖాధికారులు పి.మోహిని, విజయలక్ష్మి, కేవీ.రామలింగాచార్యులు, తదితరులు పాల్గొన్నారు.
అధికారుల సహాయంతో పనులు
కొల్లేరులో అభివృద్ధి పనులు చేపట్టాం. బుడమేర వరద నీరు కొల్లేరులోకి పోటెత్తకుండా అధికారుల సహకారంతో చర్యలు తీసుకున్నాం. అభివృద్ది పనుల కు అటవీశాఖ అనుమతులు త్వరగా రావడం లేదు. ఈ విషయంలో మానవతా దృక్పథంతో ఆలోచించాలి.
– డాక్టర్ కామినేని శ్రీనివాస్, ఎమ్మెల్యే, కైకలూరు
ప్రభుత్వ భూముల్లో చెరువులు లేవు
మా నియోజకవర్గంలో ప్రభుత్వ భూముల్లో ఎక్కడా ఆక్వా చెరువులు లేవు. కూటమి ప్రభుత్వంలో కొల్లేరు ప్రాంత అభివృద్ధి జరుగుతుందని ప్రజలు ఎదురు చూస్తున్నారు. కోర్టు అనుమతులు అనుకూలంగా వచ్చేలా అధికారులు శ్రద్ధ చూపాలి.
పత్సమట్ల ధర్మరాజు, ఎమ్మెల్యే, ఉంగుటూరు
కనీస సమాచారం ఇవ్వడం లేదు..
అటవీశాఖ మాతో సమన్వయంగా ఉండడం లేదు. కనీస సమాచారం చెప్పడం లేదు. కోమటిలంక గ్రామంలో చాలా సమస్యలున్నాయి. కొల్లేరు సమస్యల పై పోరాటంచేస్తే గత ప్రభుత్వం నాపై క్రిమినల్ కేసులు పెట్టింది. కొల్లేరు ఆపరేషన్‌లో 14వేల ఎకరాల భూములకు నష్టపరిహారం అందించేందుకు చర్యలు తీసుకోవాలి.
– చింతమనేని ప్రభాకర్, ఎమ్యెల్యే, దెందులూరు