స్థానిక సంస్థలకు ఆర్థిక కష్టాలు
ABN , Publish Date - Jun 26 , 2025 | 12:55 AM
స్థానిక సంస్థలు ఆర్థిక సంఘ నిధుల కోసం ఎదురు చూస్తున్నాయి. 15వ ఆర్థిక సంఘం నిధులు రెండో విడత విడుదలలో జాప్యంతో పంచాయతీ సర్పంచ్‌లు ఇబ్బందులు పడుతున్నారు.
రెండో విడత నిధుల విడుదలలో జాప్యం
చిన్న పంచాయతీల నిర్వహణకు ఇబ్బందులు
స్థానిక సంస్థలు ఆర్థిక సంఘ నిధుల కోసం ఎదురు చూస్తున్నాయి. 15వ ఆర్థిక సంఘం నిధులు రెండో విడత విడుదలలో జాప్యంతో పంచాయతీ సర్పంచ్‌లు ఇబ్బందులు పడుతున్నారు. చిన్న పంచాయతీలకు మరింత భారంగా మారింది.
ఏలూరు సిటీ, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల అభివృద్ధిలో 15వ ఆర్థిక సంఘ నిధులే కీలకం. ఈ నిధుల తోనే పల్లెల్లో అభివృద్ధి పనులతో పాటు పారిశుధ్యం, మంచి నీటి సరఫరా, వీధిదీపాలు తదితర నిర్వహణ పనులు చేపడుతుంటారు. ప్రతి ఆరు నెలలకు మంజూరు కావాల్సిన ఆర్థిక సంఘ నిధులు ఇప్పటికీ విడుదల కాలేదు. జూన్ ముగుస్తున్నా నిధులు విడుదల కావపోవడంతో అభివృద్ధి పనులతో పాటు నిర్వహణకు నిధులు లేక జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. వర్షాకాలం కావడంతో పారిశుధ్య నిర్వహణ భారం కానుంది. చిన్న పంచాయతీలకు సాధారణ నిధులు పెద్దగా ఉండవు కాబట్టి ఆర్ధిక సంఘ నిధులే ఆధా రం. జనాభా ప్రాతిపదికన విడుదల అవుతున్న నిధులు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నేరుగా స్థానిక సంస్థలకు విడు దల చేస్తోంది. పంచాయతీ ఖాతాల్లో జమ చేయడంలో జాప్యం జరుగుతోందనే విమర్శలు వినవస్తున్నాయి. పల్లె పాలనకు నిధులు లేక కష్టాలు ఎదురు చూడాల్సి వస్తోం దని ఇటీవల సర్పంచ్‌ల సంఘం వారు పంచాయతీ రాజ్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు. 15వ ఆర్థిక సంఘ నిధులు 2019–20లో ప్రా రంభం కాగా 2023–24 వరకు విడతల వారీగా ఉమ్మడి జిల్లాలోని పంచా యతీలకు నిధులు విడు దల చేశారు. వాటిని గత వైసీపీ ప్రభుత్వం దఫ దఫాలుగా దారి మళ్లించిందనే విమర్శలు వినవ చ్చాయి. కూటమి ప్రభుత్వం అధికా రం చేపట్టిన తర్వాత తొలివిడతగా 2024 నవంబరు లో ఆర్థిక సంఘ నిధులను నేరుగా గ్రామాలకు విడుదల చేసింది. 2024–25లో మొదటి విడత జిల్లాలోని 531 గ్రామ పంచాయతీలకు రూ.33.25 కోట్లు కోతలు లేకుండా విడుదలయ్యాయి. వీటికి ఉపాధి హామీ నిఽధులు జోడించి గ్రామాల్లో డ్రెయిన్లు, సీసీ, బీటీ రోడ్లు అభివృద్ధి చేశారు. రెండో విడత 15వ ఆర్థిక సంఘ నిధులు ఈ ఏడాదే విడుదల కావాల్సి ఉండగా ఇప్పటివరకు రాక పోవడంతో ఎదురు చూపులు చూడాల్సి వస్తోంది.
టైడ్, అన్‌టైడ్ నిధులు
ఆర్థిక సంఘ నిధులు రెండు విధాలుగా విడుదల చేయడం జరుగుతుంది. టైడ్ నిధులు, అన్‌టైడ్ నిధులుగా ఉంటాయి. టైడ్ నిధులను రహదారులు, డ్రెయిన్న్ నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులకు, అన్‌టైడ్ నిధులను కేవలం పారిశుధ్య పనులు, వీధి దీపాల నిర్వహణ, బ్లీచింగ్ కొనుగోలుకు వినియోగిస్తుంటారు. వీటితో పాటు విద్యుత్ బిల్లుల చెల్లింపులకు అన్‌టైడ్ నిధులను వినియోగిస్తారు. ప్రస్తుత వర్షాకాలం రెండో విడత ఆర్థిక సంఘ నిధులను త్వరిత గతిన విడుదల చేయాలని గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు కోరుతున్నారు. గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని, ఈ ప్రభుత్వంలో మొదటి విడత తొందరగానే విడుదలైనా రెండో విడత జాప్యమైందని, త్వరితగతిన విడుదల చేయాలని కోరుతున్నారు. సొంత సొమ్ములతో పంచాయతీలలో పనులు చేయాల్సి వస్తోందని సర్పంచ్‌లు వాపోతున్నారు.