ప్లాస్టిక్‌పై పోరు
ABN , Publish Date - Aug 10 , 2025 | 01:11 AM
స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్రలో భాగంగా ప్లాస్టిక్ భూతాన్ని అంతం చేసేందుకు రాష్ట్ర ప్రభు త్వం కృత నిశ్చయంతో వుంది.
ఆలయాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధిస్తూ దేవదాయ శాఖ ఉత్తర్వులు
స్వచ్ఛాంధ్రలో భాగంగా పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం నిర్ణయం
ద్వారకాతిరుమల, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్రలో భాగంగా ప్లాస్టిక్ భూతాన్ని అంతం చేసేందుకు రాష్ట్ర ప్రభు త్వం కృత నిశ్చయంతో వుంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని అన్ని ప్రధా న ఆలయాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడ కంపై నిషేధం విధిం చింది. ఈ మేరకు దేవ దాయ శాఖ కమిషర్ కె.రామ చంద్రమోహన్ ఉత్తర్వులు జారీచేశారు. ఆలయాల్లో పనిచేసే జాయింట్, డిప్యూటీ, సహాయ కమిషనర్లు ఈ ఆదేశాలను తప్పని సరిగా అమలు చేయాలి. సాధారణంగా ఆలయాల్లో పూజా సామగ్రి దుకాణాలు, ప్రసాదాల కౌంటర్ల వద్ద సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్ కవర్లు అమ్మకాలు విచ్చలవిడిగా జరుగుతుంటాయి. ఇలాంటి వాటికి చెక్ చెప్పాలని నిర్ణయించింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రముఖ ఆలయా లైన ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి, భీమవరం మావుళ్లమ్మ, జంగారెడ్డిగూడెం మద్ది ఆంజనేయస్వామి, నిడదవోలు కోట సత్తెమ్మ, పంచారామ క్షేత్రాలైన పాలకొల్లు క్షీరా రామలింగేశ్వరస్వామి, భీమవరం సోమేశ్వర స్వామి ఆలయాల ప్రాంగణాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను, ఏ ఆకారంలో ఉన్న నాన్ ఓవెన్ బ్యాగ్‌లైనా వినియోగాన్ని పూర్తి స్థాయి లో నిలుపుదల చేయాలి. దేవస్థానం పాట దుకాణాల్లో సైతం వీటి వినియోగాన్ని నిషేధిం చాలి. ఆలయాలను ప్లాస్టిక్ రహిత ప్రదే శాలుగా తీర్చిదిద్దేందుకు, ఈ ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రతీ ఆలయంలోని సిబ్బందిలో సీనియర్‌ను నోడల్ అధికారిగా నియమిస్తారు. ఆ అధికారి ఎప్పటికప్పుడు ఆయా ప్రాంతాలను పరిశీలిస్తూ ప్లాస్టిక్ వినియోగం లేకుండా చూస్తారు. ఈవోలు తరచూ తనిఖీలు చేస్తారు.. ఇటీవల స్వచ్ఛాం ధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆలయా ల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ కోరిక మేరకు ఈ విధంగా నిర్ణయిస్తూ ఆదేశాలిచ్చారు.
ఆలయాల్లో బోర్డుల ఏర్పాటు
ఆయా ఆలయాల్లో ప్లాస్టిక్ నిషేధం అమలు ను సూచిస్తూ ఆలయ ఆవరణ బయట, లోపల బోర్డులు ఏర్పాటు చేయాలి. కరపత్రాలు పంపిణీ చేయడంతోపాటు తరచూ మైక్‌లో అనౌన్స్‌మెంట్ చేయాలి. ఆలయ ప్రాంగణం సమీపంలో వ్యాపారాలు చేసే పాట దుకాణ దారులు ఎవరూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగించకూడదు. ఆలయాల పరిధిలో వ్యాపారస్థులకు ప్లాస్టిక్ నిషేధం అమలుపై నోటీసులు జారీచేయాలి. వ్యాపారులతో సమావేశాలు జరిపి కమిషనర్ ఉత్తర్వులపై స్పష్టత ఇవ్వాలి. ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని తెలపాలి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై వలంటీర్లు, సిబ్బందితో అప్రమత్తం చేయాలి. ఆలయాలను ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దడంలో భాగంగా.. ప్లాస్టిక్ వాడకం నిషేధంపై తాము తీసుకున్న చర్యలను సూచిస్తూ ప్రతీనెల కమిషనర్ కార్యాలయానికి ఆలయ అధికారులు నివేదికలను పంపాలి.