పంచాయతీలకు పండుగ..
ABN , Publish Date - Sep 04 , 2025 | 12:55 AM
ఎట్టకేలకు 15వ ఆర్థిక సంఘ రెండో విడత నిధులు మంగళవారం విడుదల అయ్యాయి.
పంచాయతీలు, మండలాలు, జిల్లా పరిషత్‌కు నిధులు
జిల్లాలోని 544 పంచాయతీలకు రూ. 33.94 కోట్లు
ఉమ్మడి జిల్లా పరిషత్‌కు రెండు విడతల గ్రాంట్ ఒకేసారి విడుదల
ఎట్టకేలకు 15వ ఆర్థిక సంఘ రెండో విడత నిధులు మంగళవారం విడుదల అయ్యాయి. ఈ గ్రాంటు రావాల్సి ఆరు నెలలు కావొస్తున్నా విడుదల కాక పంచాయతీలు ఆర్థికంగా ఒడిదుడు కులకు లోనయ్యాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయ డంతో పంచాయతీలకు కొంత నిధుల కొరత తీరనుంది.
ఏలూరుసిటీ, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వం మాదిరిగానే కూటమి ప్రభుత్వం కూడా ఆర్థిక సంఘ నిధులను దారి మళ్లిం చిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. గత వేసవిలో కనీసం మంచినీటి సమస్యలు పరిష్కరించేందుకు నిధులు లేక సర్పంచ్‌లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పం చాయతీలు, మండల పరిషత్‌లలో అభివృద్ధి కుం టుపడింది. పారిశుధ్య పరిస్థితులు అధ్వానంగా మారాయి. ఆ ఏడాది మార్చికి ముందే నిధులు విడుదల కావాల్సి ఉంది. 2024–25 సంవత్సరానికి సంబంధించి 2024 ఫిబ్రవరిలో 15వ ఆర్థిక సంఘం మొదటి విడత నిధులు విడుదల అయ్యా యి. ఆ తర్వాత డిసెంబరు, జనవరి నెలల్లో విడు దల కావాల్సిన రెండో విడత నిధులు ఇప్పుడు విడు దల అయ్యాయి. ఈ నిధులను శానిటేషన్‌కు, తాగు నీరు, సీసీ రహదారుల నిర్మాణం, విద్యుత్ బిల్లులు, వీధిలైట్లు, చేతి పంపుల మర మ్మతులకు ఖర్చు చేస్తారు. సాధారణంగా ఇప్పుడు 2025–26 సంవత్స రానికి సంబంధించి మొదటి విడత నిధులు విడుదల కావాల్సి ఉంది. ఈ నిధులు ఎప్పుడు విడుదల అవుతాయో వేచి చూడాల్సిందే.
జిల్లా పరిషత్‌కు రెండు విడతల నిధులు..
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిషత్‌లో 2024–25 సంవత్సరానికి సంబంధించి 15వ ఆర్థిక సంఘ నిధులు విషయానికొస్తే గతంలో మొదటి విడత నిధులు కూడా విడుదల కాలేదు. ఇప్పుడు రెండు విడతల నిధులు ఒకేసారి విడుదల ఆయ్యాయి. 15వ ఆర్థిక సంఘం రెండు విడతలు కలిపి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిషత్‌కు 21 కోట్ల 99లక్షల 60వేల 360 రూపాయలు విడుదల ఆయ్యాయి. ఇందులో మొదటి విడత నిధులు 13,76,87,261 రూపాయలు కాగా ఇందులో అన్‌టైడ్ నిధులు రూ.5,50,73,271, టైడ్ నిధులు రూ.8,26,13, 990 విడుదల అయ్యాయి. రెండో విడత నిధులు రూ.8,22,73,099 నిధులు విడుదల కాగా ఇందులో అన్‌టైడ్ నిధులు 3,29,09,240 రూపాయలు, టైడ్ నిధులు రూ. 4,93,63,959 విడుదల అయ్యాయి.
మండల పరిషత్‌లకు రూ.16.50 కోట్లు
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని 48 మండలాలకు సంబంధించి 2024–25 సంవత్సరానికి రెండోవిడత గ్రాంట్ మొత్తం రూ.16,50,97,853 నిధులు విడుదల అయ్యాయి. ఇందులో అన్‌టైడ్ నిధులు రూ.6,60,39,122, టైడ్ నిధులు రూ.9,90,58,731 విడుదల అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఈ నిధులను ఖర్చు చేయాల్సి ఉంది.