కొత్త అల్లుడికి అదిరిపోయే ఆతిథ్యం
ABN , Publish Date - Oct 22 , 2025 | 12:50 AM
కొత్త అల్లుడికి అదిరిపోయే ఆతిథ్యం ఇవ్వడంలో గోదావరి జిల్లా అత్తింటివారు ముందుంటారు.
వీరవాసరం (భీమవరం టౌన్), అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): కొత్త అల్లుడికి అదిరిపోయే ఆతిథ్యం ఇవ్వడంలో గోదావరి జిల్లా అత్తింటివారు ముందుంటారు. కొత్త అల్లుడికి ఈ మర్యాదలు ఎక్కువగా సంక్రాంతి పండగకు ప్రత్యేక విందు ఇస్తారు. ఇప్పుడు దీపావళికి కూ డా విందులతో అదరగొడుతున్నారు. అల్లుడికి విందు అంటే ఒకటో, రెండో రకాలతో కాదు దాదాపు 200 రకాలతో విందు భోజనం పెట్టి అల్లుడికి దీపావళి స్పెషల్‌ను అందించారు. వీరవాసరం మండలం పంజా వేమవరం గ్రామానికి చెందిన మళ్లా తులసీ రాంబాబు కుమార్తె గోవర్ధినికి విశాఖపట్నంకు చెందిన రాహుల్‌తో ఈ నెల 11న వివిశాఖపట్నంలో వివాహం చేశారు. పెళ్లి అయిన 10 రోజులకే దీపావళి పండుగ రావడంతో రాహుల్ అత్తింటికి వచ్చారు. రాహుల్‌కు 200 రకాల నాన్‌వెజ్, వెజిటేరియన్ వంటకాలతో కమ్మనైన విందు భోజనం రూచి చూపించారు. అల్లుడికి స్వయంగా మా మ రాంబాబు వడ్డించారు. దీంతో అల్లుడు అత్తింటివారి మర్యాదలకు, విందుకు ఫిదా అయిపోయిడు. ఇలాంటి మర్యాదను తాను ఎప్పుడూ చూడలేదంటూ మామ రాంబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈసందర్భంగా రాంబాబు మాట్లాడుతూ దీపావళి పండుగను పురస్కరించుకుని అల్లుడు, కుతూరుని ఇంటికి తీసుకువచ్చామని, కొత్త అల్లుడిని సర్‌ప్రైజ్ చేయాలనే ఉద్దేశంతో 200 రకాలను దగ్గరుండి తయారు చేయించానని ఆనందంతో తెలిపారు.