Share News

నాన్నకు ప్రేమతో..

ABN , Publish Date - Jun 16 , 2025 | 12:05 AM

ఫాదర్స్‌ డే సందర్భంగా పలు చోట్ల పిల్లలకు వారి తండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు.

నాన్నకు ప్రేమతో..
తండ్రి మనోజ్‌కు పాదపూజ చేస్తున్న అమరావతి బ్రాండ్‌ అంబాసిడర్‌ వైష్ణవి

తండ్రికి పాదపూజ చేసిన వైష్ణవి

ముదినేపల్లి, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): ఫాదర్స్‌ డే సందర్భంగా పలు చోట్ల పిల్లలకు వారి తండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు. అమరావతి బ్రాండ్‌ అంబాసి డర్‌ అంబుల వైష్ణవి తండ్రి డాక్టర్‌ మనోజ్‌కు ఆదివారం పాద పూజ చేశారు. అన్నీ తానై తనను ఉన్నత స్థాయిలో చూడాలని తండ్రి కృషి, శ్రమ మరువలేనిదని వైష్ణవి అన్నారు. అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.60 లక్షల విరాళం ఇచ్చేందుకు తన తండ్రి ప్రోత్సాహం ఎంతో ఉందని కూడ ఆమె భావోద్వేగంతో తెలిపారు.

Updated Date - Jun 16 , 2025 | 12:06 AM