తండ్రిని కొట్టి చంపిన కొడుకు
ABN , Publish Date - Oct 06 , 2025 | 12:03 AM
మండలంలోని వింజరం పంచాయతీ ముత్యా లంపాడులో తండ్రిని కొడుకు కొట్టి చంపిన సంఘటన ఆదివారం జరిగింది.
కుక్కునూరు, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): మండలంలోని వింజరం పంచాయతీ ముత్యా లంపాడులో తండ్రిని కొడుకు కొట్టి చంపిన సంఘటన ఆదివారం జరిగింది. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. క్రిష్టం కృష్ణ (52)కు భార్య ధనలక్ష్మి, కిరణ్‌కుమార్, జవహర్ ఇద్దరు కుమారులు ఉన్నారు. కృష్ణ కొంత కాలంగా మద్యానికి బానిసయ్యాడు. మద్యం మత్తులో రోజూ భార్య ధనలక్ష్మిని ఇబ్బంది పెడుతున్నాడు. చిన్న కొడుకు జవహర్ పలుమార్లు తండ్రిని మందలించాడు. శనివారం రాత్రి 10 గంటల సమయంలో కృష్ణ తాగివచ్చి భార్య ధనలక్ష్మిని తిడుతూ కొట్టాడు. జవహర్ అడ్డువచ్చి తండ్రితో గొడవ పడ్డాడు. అనంతరం తండ్రి తలను పట్టుకుని గుమ్మానికి కొట్టాడు. తీవ్రంగా గాయపడిన కృష్ణ ఆదివారం ఉదయం 7గంటల సమయంలో మృతి చెందాడు. దీనిపై మృతుడు కృష్ణ భార్య ధనలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కుక్కునూరు సీఐ రమేశ్‌బాబు సిబ్బందితో సంఘటన స్థలానికి వెళ్లి విచారణ జరిపి కేసు నమోదు చేశారు.