Share News

మమ్మల్ని బతకనివ్వండి..

ABN , Publish Date - Jul 01 , 2025 | 01:09 AM

భూమిని నమ్ముకుని బతుకుతున్నాం. కష్ట పడి పంటలు పండిస్తున్నాం. ఎక్కడా లేని విధంగా పామాయిల్‌ పంటను విస్తృతం చేశాం. నష్టమొచ్చినా.. కష్టమొచ్చినా మా అంత ట మేముగా నిలదొక్కుకున్నాం. కానీ ఇప్పుడు పామాయిల్‌ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేస్తామం టున్నారు. ఇప్పుడా విషయం అంత అవసర మా? రైతు సమస్యలపై మీరు ప్రతీసారి స్పంది స్తూనే ఉన్నారు. రైతులను ఆదుకోవడానికి మరింత ప్రయత్నించండి.. అంటూ పామా యిల్‌ రైతులు ఎంపీ పుట్టా మహేశ్‌ కుమార్‌ను వేడుకున్నారు.

   మమ్మల్ని బతకనివ్వండి..

పొగాకు, పామాయిల్‌ కష్టాలెన్నో..

పెదవేగి పామాయిల్‌ ఫ్యాక్టరీని ప్రైవేటీకరించొద్దు

పొగాకుకు ఊతమిచ్చి..నష్టాలు తీర్చండి

ఎంపీ మహేశ్‌కు రైతుల విన్నపం

(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి)

భూమిని నమ్ముకుని బతుకుతున్నాం. కష్ట పడి పంటలు పండిస్తున్నాం. ఎక్కడా లేని విధంగా పామాయిల్‌ పంటను విస్తృతం చేశాం. నష్టమొచ్చినా.. కష్టమొచ్చినా మా అంత ట మేముగా నిలదొక్కుకున్నాం. కానీ ఇప్పుడు పామాయిల్‌ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేస్తామం టున్నారు. ఇప్పుడా విషయం అంత అవసర మా? రైతు సమస్యలపై మీరు ప్రతీసారి స్పంది స్తూనే ఉన్నారు. రైతులను ఆదుకోవడానికి మరింత ప్రయత్నించండి.. అంటూ పామా యిల్‌ రైతులు ఎంపీ పుట్టా మహేశ్‌ కుమార్‌ను వేడుకున్నారు.

ఆయన క్యాంపు కార్యాలయంలో సోమవారం పామాయిల్‌, పొగాకు రైతులు ఎంపీతో భేటీ అయి తమ గోడును వెళ్లబోసు కున్నారు. ప్రత్యేకించి పెదవేగి పామాయిల్‌ ఫ్యాక్టరినీ ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టిలో పెట్టాలని అభ్యర్థించారు. వీరితో పాటు పొగాకు రైతులు కూడా తమ సమస్యను ఏకరవు పెట్టారు. ఇటీవల జరిగిన పొగాకుబోర్డు పాలకవర్గ సమావేశంలో 49.70 ఎన్‌ఎల్‌ఎస్‌ ప్రాంతానికి 48.6 ఎన్‌కేజీఎస్‌ పండించడానికి అనుమతించినట్టు తెలిసిందని తద్వారా ఒక బ్యారెన్‌కు 35 క్వింటాళ్లు మాత్రమే వస్తున్న విషయాన్ని ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే ఖర్చులు పెరిగిపోయాయని, బ్యాంకు రుణాలను తీర్చలేకపోతున్నామని, లైసెన్సుపై పండే అదనపు పంటకి పెనాల్టీలు, లైసెన్సులు తీసుకోవడం తమకు అదనపు భారంగా మారిం దని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్‌ఎల్‌ఎస్‌ ప్రాం తానికి 58.25 మిలియన్‌ కేజీల కోటా ఇప్పించి రైతులకు న్యాయం చేయాలని అభ్యర్థించారు.

సీఎంను కలిసి వివరిస్తా : ఎంపీ

పామాయిల్‌, పొగాకు పండించే రైతులకు న్యాయం చేస్తానని, వారికి కష్టమొచ్చినా.. నష్టమొచ్చినా ఇన్నాళ్లు అండగా ఉంటున్నానని, ఇప్పుడున్న సమస్యలను పరిష్కరించాల్సిందిగా సీఎం చంద్రబాబును కలిసి వివరించ బోతున్నట్లు ఎంపీ రైతులకు భరోసా ఇచ్చా రు. వీలైతే మంగవారమే సీఎంను కలిసి ఆయన దృష్టికి పామాయిల్‌, పొగాక రైతుల సమస్యలను ఖచ్చితంగా తీసుకెళతానని ప్రక టించారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలకు సహకరించాల్సిందిగా రైతులకు విజ్ఞప్తి చేశారు.

Updated Date - Jul 01 , 2025 | 01:09 AM