Share News

ధాన్యం బకాయి చెల్లింపు

ABN , Publish Date - Jul 03 , 2025 | 12:31 AM

ధాన్యం కొనుగోలుతో రైతులకు చెల్లించాల్సిన మొత్తంలో బుధవారం రూ.18.58 కోట్లు విడుదలయ్యాయి.

ధాన్యం బకాయి చెల్లింపు

రైతుల ఖాతాలో రూ.18.58 కోట్లు జమ

ఏలూరు సిటీ, జూలై 2(ఆంధ్రజ్యోతి): ధాన్యం కొనుగోలుతో రైతులకు చెల్లించాల్సిన మొత్తంలో బుధవారం రూ.18.58 కోట్లు విడుదలయ్యాయి. జిల్లాలో 2.70లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం 2.53 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. మొత్తం 20,523 మంది రైతుల నుంచి రూ.582.78 కోట్లు విలువైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించారు. 2,52,473 మెట్రిక్‌ టన్నులకు సంబంధించి 546.45 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఇంకా 1324 రైతులకు రూ.36.35 కోట్లు చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం రూ. 18.58 కోట్లు రైతుల ఖాతాలకు జమ అయ్యాయని జిల్లా పౌరసరఫరాల శాఖ ఉన్నతాఽఽధికారులు చెబుతున్నారు. మిగిలిన రూ.17.77 కోట్లు కూడా విడుదల అవుతాయని అధికారులు చెప్పారు. గత ప్రభుత్వంతో పోలిస్తే ఈసారి ధాన్యం సొమ్ములు సక్రమంగా రైతుల బ్యాంకు ఖాతాలకు చేరాయి. గత ప్రభుత్వ హ యాంలో ధాన్యం సొమ్ము నెలల తరబడి చెల్లించకపోవడంతో రైతులు ఇబ్బం దులు పడ్డారు. కూటమి ప్రభుత్వం ధాన్యం బకాయి సొమ్ములను త్వరితగతిన విడుదల చేసింది. రబీ కొనుగోళ్లలో కూడా 48 గంటల్లో సొమ్ములు రైతుల బ్యాంకు ఖాతాలకు జమచేయాల్సి ఉండగా 24 గంటలలోనే జమ చేశారు. చివరిగా కొనుగో లు చేసిన ధాన్యం సొమ్ము బకాయిలు పడడం జరిగింది. ఆ బకాయి సొమ్ములు కూడా విడుదల అవుతుండడంతో రైతులకు ఊరట లభించింది. మిగిలిన బకాయి సొమ్ము కూడా త్వరలో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Updated Date - Jul 03 , 2025 | 12:31 AM