కూటమి పాలనతో రైతుల్లో ఆనందం
ABN , Publish Date - Aug 14 , 2025 | 12:57 AM
అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథ కం ద్వారా ప్రతి రైతుకు ఏడాదికి రూ.20 వేల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాం.
జోరువానలో రైతుల ట్రాక్టర్ ర్యాలీ
భీమవరం టౌన్, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి):‘అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథ కం ద్వారా ప్రతి రైతుకు ఏడాదికి రూ.20 వేల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాం. కూ టమి ప్రభుత్వంలో రైతులంతా ఆనందంగా వున్నారు’ అని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు(అంజిబాబు)అన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలో బుధవారం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. టీడీపీ ఇన్‌చా ర్జ్, మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి మా ట్లాడుతూ సూపర్ సిక్స్ హామీలను కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా నెరవేరుస్తోందని చెప్పారు. అంతకుముందు భీమవరం నియోజకవర్గానికి చెందిన 150 ట్రాక్టర్లతో రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని అం జిబాబు, సీతారా మలక్ష్మి జెండా ఊపి ప్రారంభించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, జనసేన అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు ట్రాక్టర్లను నడిపి రైతులను ఉత్తేజపరిచారు. వర్షం కురుస్తుండగానే ర్యాలీ ముందుకు సాగింది. ప్రకాశం చౌక్, బస్ కాంప్లెక్స్ సెంటర్, ఓవర్ బ్రిడ్జి మీదుగా నరస్సయ్య అగ్రహారంలోని మార్కెట్ యార్డు వరకు కొనసాగింది. కార్యక్రమంలో ఏపీ మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్ పర్సన్ పీతల సుజాత, టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థ సారథి, వెండ్ర శ్రీనివాస్, చనమల్ల చంద్రశేఖర్ ఏఎంసీ చైర్మన్ కలిదిండి సుజాత రామచంద్రరాజు, వైస్ చైర్మన్ బండి రమేష్ తదితరులు పాల్గొన్నారు.