Share News

రైతుల్లో గుబులు

ABN , Publish Date - Nov 06 , 2025 | 12:24 AM

మొంథా తుఫాన్‌ ప్రభా వంతో భారీ వర్షాలు కురవడంతో దాని ప్రభావం నుంచి వరి పైరు ఇప్పుడి ప్పుడే తేరుకుంటోంది. మళ్లీ ఇంతలోని వర్షాలు కరుస్తాయన్న హెచ్చరికలు అన్నదాతను వణికిస్తోంది.

రైతుల్లో గుబులు
పంట చేలు పరిశీలిస్తున్న కలెక్టర్‌ వెట్రిసెల్వి

రెండు రోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరిక

మొంథా ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న వరి పంట

మళ్లీ వర్షాలు కురిస్తే తీవ్రంగా నష్టపోతామని అన్నదాతల ఆవేదన

ఏలూరు రూరల్‌, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాన్‌ ప్రభా వంతో భారీ వర్షాలు కురవడంతో దాని ప్రభావం నుంచి వరి పైరు ఇప్పుడి ప్పుడే తేరుకుంటోంది. మళ్లీ ఇంతలోని వర్షాలు కరుస్తాయన్న హెచ్చరికలు అన్నదాతను వణికిస్తోంది. మొంథా తుఫాన్‌ తీరం దాటి వారం రోజులు గడు స్తున్నా ఇంకా పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. పంట చేలల్లో నిలబడి నీళ్లను బయటకు పంపించడానికి అన్నదాతలు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. పొలాల గట్లకు గండికొట్టి నీటిని బయటకు పంపుతున్నారు. ఇప్పుడిప్పుడే నీళ్ళు తగ్గి కొంచెం పంటలు తేరుకుంటున్నాయి. ఓవైపు వాతా వరణశాఖ అల్పపీడన హెచ్చరికలు రైతులను కలవరపెడుతుంటే బుధవారం సాయంత్రం కురిసిన వర్షం వారిని తీవ్ర ఆందోళనకు గురి చేసింది. కొన్ని ప్రాంతాల్లో చిరు జల్లులు కుర వగా, జిల్లా వ్యాప్తంగా మేఘావృతమైంది. వరి కంకులు నీటిలో రోజులు తరబడి ఉండడంతో తాలు ఎక్కువగా వచ్చి దిగుబడుల్లో భారీ కోత తప్పదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. మరికొన్ని చోట్ల పంట మొత్తం నేలవాలి నీళ్లలోనే ఉండిపోవడంతో కుళ్లిపోయే స్థితికి చేరుకుందని వాపోతున్నారు. పెట్టుబడి మొత్తం వర్షార్పణమే నని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోసారి పంట పొలాలు ముంపు బారిన బడితే ఇక పూర్తిగా దిగుబడులుపై ఆశలు వదిలేసు కోవడమేనని అన్నదాతలు చెబుతున్నారు.

ముదినేపల్లిలో 2,118 ఎకరాల్లో వరి పంట నష్టం

ముదినేపల్లి : మొంథా తుఫాన్‌ ప్రభావంతో ముదినేపల్లి మండలంలో సార్వా వరి పైరుకు కలిగిన నష్టం అంచనాల సేకరణ పూర్తయింది. మండలంలో 26 రెవెన్యూ గ్రామాల పరిధిలో 2,118 ఎకరాల్లో వరి పంట పూర్తిగా దెబ్బతిన్నట్టు వ్యవసాయశాఖ అధికారులు, సిబ్బంది నమోదు చేశారు. మండలంలో సుమారు 1500 మంది రైతులకు ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం అందనుంది. ఎకరానికి రూ.10 వేలు చొప్పున మండలానికి సుమారు 2.03 కోట్లు నష్టపరి హారం అందనుంది. పంట నష్టపోయిన రైతుల జాబితాలను రైతు సేవా కేంద్రాల వద్ద ప్రదర్శించామని ఏవో వేణుమాధవ్‌ తెలిపారు. మండలంలోని వాడవల్లి రెవెన్యూ గ్రామ ఏరియాలో ఒక్క ఎకరంలో కూడా పంట నష్టం జరగలేదన్నారు.

వట్లూరులో పంట పొలాలు పరిశీలించిన కలెక్టర్‌

పెదపాడు : మొంథా తుఫాన్‌ ప్రభావంతో నష్టపోయిన ప్రతి రైతునూ ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకుంటుందని జిల్లా కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి తెలిపారు. పెదపాడు మండలం వట్లూరు పరిధిలోని పంటపొలాలను ఆమె బుధవారం పరిశీ లించారు. పంటలపై తుఫాన్‌ ప్రభావం గురించి వ్యవ సాయాధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఖరీఫ్‌ 2025 సీజన్‌కు సంబంధించి ఈ–పంట సూపర్‌ చెక్‌ రికార్డులను పరిశీలించారు. జిల్లా వ్యవసాయశాఖ జేడీఏ షేక్‌ హాబీబ్‌ బాషా, ఏలూరు సబ్‌ డివిజన్‌ ఏడీఏ ఈ.అనిలకుమారి, ఏవో షేమ్‌ ఇమా మ్‌ కాశీం, డిప్యూటీ తహసీల్దారు రామా రావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 06 , 2025 | 12:24 AM