Share News

ఎమ్మెల్యేపై అసత్య కథనాలు.. బెదిరింపులు

ABN , Publish Date - Jul 01 , 2025 | 01:07 AM

పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పై ఓ ఆంగ్ల ఈ–పేపర్‌లో అసత్య కథనాలు రాయడంతో పాటు సామాజిక మాధ్యమాల్లో పెట్టి బెదిరింపులకు పాల్పడిన పాదం వీర వెంకట సత్యనారాయణ మూర్తి నాయుడును సోమవారం పోలవరం డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో అరెస్టు చేశా రు.

ఎమ్మెల్యేపై అసత్య కథనాలు.. బెదిరింపులు
జీలుగుమిల్లిలో ర్యాలీ నిర్వహిస్తున్న కూటమి నాయకులు

ఒకరి అరెస్టు.. 14 రోజుల రిమాండ్‌

జంగారెడ్డిగూడెం/జీలుగుమిల్లి,జూన్‌30(ఆంధ్రజ్యోతి): పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పై ఓ ఆంగ్ల ఈ–పేపర్‌లో అసత్య కథనాలు రాయడంతో పాటు సామాజిక మాధ్యమాల్లో పెట్టి బెదిరింపులకు పాల్పడిన పాదం వీర వెంకట సత్యనారాయణ మూర్తి నాయుడును సోమవారం పోలవరం డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో అరెస్టు చేశా రు. డీఎస్పీ మాట్లాడుతూ ఎమ్మెల్యేపై అసత్య కఽథనాలు రాసి వాటిని ఆపాలంటే రూ.25 లక్షలు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడడంతో అతనిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే స్వయంగా జీలుగుమిల్లి పోలీస్‌ స్టేషన్‌లో గతనెల 25న ఫిర్యాదు చేశారన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు అనంతరం సోమవారం విజయవాడలో అరెస్టు చేసి జంగారెడ్డి గూడెం ఏరియా ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం పట్టణంలోని కోర్టుకు హాజరుపర్చగా న్యాయ మూర్తి 14 రోజులు రిమాండ్‌ విధించినట్టు తెలిపారు. నిందితుడిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. గతంలో ఇదే తరహాలో అనేక మంది ప్రజా ప్రతి నిధులపై అసత్య కఽథనాలు రాసినట్టు డీఎస్పీ తెలిపారు.

జీలుగుమిల్లిలో కూటమి నాయకుల ర్యాలీ

కాగా మూర్తిని అరెస్టు చేయడంతో హర్షం వ్యక్తం చేస్తూ జీలుగుమిల్లిలో జాతీయ రహదారిపై సోమవారం నియోజక వర్గ కూటమి నాయకులు ర్యాలీ నిర్వహించారు. జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డమణుగు రవికుమార్‌ మాట్లాడుతూ మీడియా ప్రతినిధులు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ మంచి చెడులను గుర్తించి వార్త కఽథనాలు ప్రచురిం చాలన్నారు. కుక్కునూరు, టి.నరసాపురం జనసేన మండల పార్టీ అధ్యక్షులు ములిశెట్టి యుగంధర్‌, అడపా నాగరాజు, నాయకులు మాదేపల్లి శ్రీను, చిర్రి శ్రీను, కోలా మధు, జి.లక్ష్మీ నారాయణ, బుడిపుడి చిరంజీవి, తమ్మన సాంబ ఉన్నారు.

‘ఓ ఆంగ్ల ఈ–పేపర్‌లో ఆరు నెలలుగా మూర్తి అసత్య ఆరోపణలు చేస్తున్నాడు. బ్లాక్‌ మెయిల్‌కు పాల్పడుతూ అసత్య వార్తా కఽథనాల్ని ప్రచురించి కూటమి ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేందుకు ప్రయత్నించాడు. పోలవరం నియోజక వర్గంలో అభివృద్ధి పనులు చూసి ఓర్వలేక కొందరు నాపై తప్పుడు కథనాలు రాయించారు. ఊరు పేరులేని పేపర్లతో బ్లాక్‌ మెయిల్‌ చేసే వారిపై పోలీసులు విచారణ చేసి చర్యలు తీసుకోవాలి. అసత్య ఆరోపణలతో తప్పుడు వార్తలు రాసే వారికి భయపడేది లేదు’ అంటూ ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పేర్కొన్నారు.

Updated Date - Jul 01 , 2025 | 01:07 AM