Share News

దొంగనోట్ల చలామణి ముఠా నిందితుడి అరెస్ట్‌

ABN , Publish Date - Jun 08 , 2025 | 12:48 AM

దొంగ నోట్లను చలామణితో అమాయక ప్రజల్ని మోసగిస్తున్న ముఠా ప్రధాన నిందితుడుని భీమడోలు పోలీసులు అరెస్టు చేశారు. శనివా రం భీమడోలు సర్కిల్‌ పోలీస్‌స్టేషన్‌లో విలేకర్ల సమావేశంలో డీఎస్పీ శ్రావణ్‌కుమార్‌ తెలిపిన వివరాలివి..

దొంగనోట్ల చలామణి ముఠా నిందితుడి అరెస్ట్‌
వివరాలు వెల్లడిస్తున్న ఏలూరు డీఎస్పీ శ్రావణ్‌కుమార్‌

భీమడోలు, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి): దొంగ నోట్లను చలామణితో అమాయక ప్రజల్ని మోసగిస్తున్న ముఠా ప్రధాన నిందితుడుని భీమడోలు పోలీసులు అరెస్టు చేశారు. శనివా రం భీమడోలు సర్కిల్‌ పోలీస్‌స్టేషన్‌లో విలేకర్ల సమావేశంలో డీఎస్పీ శ్రావణ్‌కుమార్‌ తెలిపిన వివరాలివి.. ద్వారకాతిరుమల మండలం లక్ష్మీపురానికి చెందిన కోడూరి రవితేజ అనే వ్యక్తి ప్రస్తుతం జంగారెడ్డిగూడెంలో నివాసం ఉంటున్నాడని కొంతమంది సభ్యులతో కలిసి ముఠాగా ఏర్పడి దొంగనోట్లు మారుస్తూ ప్రజ ల్ని మోసగిస్తున్నట్టు తెలిపారు. గతనెల 2వ తేదీన ద్వారకాతిరుమలలో హోటల్‌ నడుతుపున్న కొల్లి సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని కలిసి రెండు లక్షల 50 వేల రూపాయలు అసలు సొమ్ము ఇస్తే రూ.15 లక్షలు దొంగనోట్లు ఇస్తానని ప్రలోభపెట్టి తన ముఠాసభ్యులు షేక్‌ నాగూర్‌ మీరావలి, వీరంకి రాజేష్‌లతో దొంగనోట్లు పంపించి మారుస్తుండగా ద్వారకాతిరుమల ఎస్‌ఐ సుధీర్‌ సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. అప్పటినుంచి ప్రధాన నిందితుడు కోడూరి రవితేజ పరారీలో ఉన్నాడు. శనివారం ముందస్తు సమాచారంతో సీఐ విల్సన్‌ నిందితుడిని అరెస్టు చేశారు. జంగారెడ్డిగూ డెంలో జరిగిన చోరీ కేసులలో నిందితుడు రవితేజ నుంచి ఒకకారు, రూ.65 లక్షల దొంగనోట్లు, బంగారు అభరణాలు స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ తెలిపారు. భీమడోలు సీఐ విల్సన్‌, ఎస్‌ఐ సుధాకర్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 08 , 2025 | 12:48 AM