డబ్బులిస్తారా? సస్పెండ్ చేయమంటారా ?!
ABN , Publish Date - Dec 09 , 2025 | 12:43 AM
‘మీ స్కూలు, మండలంలో మధ్యాహ్న భోజన పథకంలో అవకతవకలు భారీగా జరు గుతున్నట్టు మా ఆఫీసుకు ఫిర్యాదులొచ్చాయి. కొందరు పేరెంట్స్ కంప్లైంట్స్ ఇచ్చారు. కొద్దిసే పట్లో మిమ్మల్ని సస్పెండ్ చేస్తున్నాం. దానిని ఆపాలంటే వెంటనే ఫోన్ పే నంబరుకు డబ్బులు (రూ.వేలల్లో) పంపించండి. లేకపోతే మీపై చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్‌కు సిఫారసు చేస్తా. మీ గురించి పత్రికల్లో చెడు గా రాయిస్తా’ అంటూ రాష్ట్ర ఆహార కమిషన్ మెంబరు పేరిట ఓ అపరితుడు జిల్లాలోని పలువురు ఎంఈవోలు, ప్రధానోపా ధ్యాయు లకు శని, సోమవారాల్లో ఫోన్లు చేసి బెదిరిం పులు, హెచ్చరికలు చేయడం కలకలం రేపిం ది.
ఫుడ్ కమిషన్ సభ్యుడి పేరిట అపరిచితుడి హల్‌చల్
భోజన పథకంలో అవకతవకలంటూ బెదిరింపులు
పలువురు ఎంఈవోలు, హెడ్మాస్టర్లకు ఫోన్లు
రూ.30 వేలు చేజార్చుకున్న ఓ హెచ్‌ఎం..డీఈవోకు ఫిర్యాదు
ఏలూరు అర్బన్, డిసెంబరు 8(ఆంధ్ర జ్యోతి): ‘మీ స్కూలు, మండలంలో మధ్యాహ్న భోజన పథకంలో అవకతవకలు భారీగా జరు గుతున్నట్టు మా ఆఫీసుకు ఫిర్యాదులొచ్చాయి. కొందరు పేరెంట్స్ కంప్లైంట్స్ ఇచ్చారు. కొద్దిసే పట్లో మిమ్మల్ని సస్పెండ్ చేస్తున్నాం. దానిని ఆపాలంటే వెంటనే ఫోన్ పే నంబరుకు డబ్బులు (రూ.వేలల్లో) పంపించండి. లేకపోతే మీపై చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్‌కు సిఫారసు చేస్తా. మీ గురించి పత్రికల్లో చెడు గా రాయిస్తా’ అంటూ రాష్ట్ర ఆహార కమిషన్ మెంబరు పేరిట ఓ అపరితుడు జిల్లాలోని పలువురు ఎంఈవోలు, ప్రధానోపా ధ్యాయు లకు శని, సోమవారాల్లో ఫోన్లు చేసి బెదిరిం పులు, హెచ్చరికలు చేయడం కలకలం రేపిం ది.దీనిపై సోమవారం సాయంత్రం ఏపీ ప్రధా నోపాధ్యాయుల సంఘం జిల్లా నాయ కత్వం రంగంలోకి దిగింది. బెదిరింపులు, దుర్భాషలు, డబ్బుల కోసం డిమాండ్ చేసిన వ్యక్తి వివరా లను ఫోన్ నంబరుసహా డీఈవో వెంకట లక్ష్మమ్మకు ఫిర్యాదు చేసింది. తొలుత ఫిర్యాదు ను మంగళవారం భీమడోలు సీఐకు ఇవ్వాలని, అదే ఫిర్యాదును తాను ఎస్పీకి పంపిస్తానని డీఈవో వెంకటలక్ష్మమ్మ చెప్పడంతో హెచ్ ఎంల సంఘం నాయకులు వెనుదిరిగారు.
భీమడోలు జడ్పీ హైస్కూలు హెచ్‌ఎం జి.ఎస్.పద్మజకు శనివారం ఓ అపరిచిత నంబ రు నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. స్టేట్ ఫుడ్ కమి షన్ కార్యాలయం(విజయవాడ) నుంచి ఫోన్ చేస్తున్నానంటూ, తాను స్టేట్ ఫుడ్ కమిషన్ మెంబరు నారాయణనంటూ మాట్లాడాడు. స్కూలులో మధ్యాహ్న భోజన పథకం బియ్యం, కోడిగుడ్లు, చిక్కీల విషయంలో ప్రభు త్వం పంపిణీ చేసిన పరిణామానికి తగిన విధంగా వినియోగంలో లెక్కలు సరిపోలడం లేదని, ఆ మేరకు అవకతవకలు జరుగుతున్న ట్టుగా తమ కార్యాలయానికి ఫిర్యాదులు రావ డంతోపాటు విద్యార్థుల తల్లిదండ్రులు విజయ వాడలోని స్టేట్ ఫుడ్ కమిషన్ ఆఫీ సుకు వచ్చి మీపై ఫిర్యాదు చేశారని గట్టి స్వరంతో బెదిరింపులకు దిగాడు. ఫిర్యాదుపై చర్యలు తీసుకోకుండా ఉండేందుకు వెంటనే డబ్బులు ఫోన్ పే ద్వారా పంపాలంటూ శనివారం బెదిరించడంతో హెచ్‌ఎం తొలుత రూ.5 వేలు, తదుపరి మరో రూ.25 వేలు ట్రాన్స్‌ఫర్ చేశా రు. అంతకుముందు భీమడోలు ఎంఈవోకు ఇదే వ్యక్తి ఫోన్‌చేసి మీరు మండలంలో ఎని మిదేళ్లుగా పనిచేస్తున్నా సరిగా విధులు నిర్వర్తించడం లేదని, తమ వద్దకు వచ్చిన పేరెంట్స్‌తో కలెక్టర్‌కు, మానవ హక్కుల సం ఘానికి ఫిర్యాదు చేయించి సస్పెండ్ చేయి స్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. మండలం లోని పాఠశాలల హెచ్‌ఎంల ఫోన్ నంబర్ల జాబితాను పంపాలని ఆదేశించడంతో భీమడో లు ఎంఈవో–2 పంపించారు. ఈ ఫోన్ నంబ ర్ల ఆధారంగానే హెచ్‌ఎం పద్మజను ఆ వ్యక్తి బెదిరించి ఫోన్ పేకు డబ్బులు వేయించుకున్నాడు. ఇదే నేపథ్యంలో సోమ వారం ఏలూరు, పెదపాడు, జీలుగుమిల్లి, తదితర ఎంఈవోలకు ఫోన్ చేసి మండలంలోని ప్రధానో పాధ్యా యుల ఫోన్ నంబర్లను అడగడంతో పాటు, పలువురు హెచ్‌ఎంలకు ఫోన్ చేసి మధ్యాహ్న భోజన పథకంలో అవకతవకలంటూ డబ్బులకు డిమాండ్ చేశాడు. ఫోన్ చేసిన వ్యక్తి సంభాషణలను అనుమా నించిన పెదపా డు ఎంఈవో–2 ఎస్.నరసింహమూర్తి దీటుగానే బదులి వ్వడంతో ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. ఆ వెంటనే విజయ వాడలోని స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ వ్యక్తిగత కార్యదర్శి శ్రీనివాసన్‌కు పెదపాడు ఎంఈవో ఫోన్‌చేసి అపరిచిత వ్యక్తి గురించి వివరాలు చెప్పడంతో తమ కార్యాల యంలో ఆ పేరుగల వ్యక్తిగాని, అధికారి గాని లేరని తేల్చి చెప్పడంతో వెంటనే మండలంలోని హెచ్‌ఎంల వాట్సాప్ గ్రూపులో ఫేక్ ఆఫీసర్ సమాచా రాన్ని పోస్టు చేశారు. ఎవరూ డబ్బులివ్వవద్దని హెచ్చరించారు.