ముఖ హాజరు వేయాల్సిందే!
ABN , Publish Date - Jun 24 , 2025 | 01:00 AM
దేశవ్యాప్తంగా అంగన్‌వాడీ సేవల్లో సమూల మార్పులకు కేంద్ర శిశు, సంక్షేమ మంత్రిత్వశాఖ శ్రీకారం చుట్టింది. జూలై 1వ తేదీ నుంచి అంగన్‌వాడీ కేంద్రాల్లో ముఖ ఆధారిత గుర్తింపు (ఫేస్ రికగ్నిషన్)ను ఆచరణలోకి తీసుకురానుంది.
జూలై 1 నుంచి ముఖ ఆఽధారితంగా లబ్ధిదారులకు పౌష్టికాహారం
కేంద్ర మంత్రిత్వశాఖ ఉత్తర్వులు జారీ
సిద్ధమవుతున్న ఐసీడీఎస్ అధికారులు
దేశవ్యాప్తంగా అంగన్‌వాడీ సేవల్లో సమూల మార్పులకు కేంద్ర శిశు, సంక్షేమ మంత్రిత్వశాఖ శ్రీకారం చుట్టింది. జూలై 1వ తేదీ నుంచి అంగన్‌వాడీ కేంద్రాల్లో ముఖ ఆధారిత గుర్తింపు (ఫేస్ రికగ్నిషన్)ను ఆచరణలోకి తీసుకురానుంది. దీంతో అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందజేసే పౌష్టికా హారం పక్కదారి పట్టకుండా పారదర్శకతకు పెద్దపీట వేసేలా కేంద్ర మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
(ఏలూరు–ఆంధ్రజ్యోతి):
లబ్ధిదారులకు సరుకులు పంపిణీ చేసేటప్పుడు, ఆహార పంపిణీ సమయంలో ముఖ గుర్తింపు తప్పనిసరి కానుంది. పోషణ్ ట్రాకర్ యాప్ ద్వారా అమలు చేయనున్నారు. జిల్లాలో పది సీడీపీవో ప్రాజెక్టుల కార్యాలయాల పరిధిలో 2,225 కేంద్రాల్లో మొత్తం 1,24,078 మంది అంగన్‌వాడీ సేవలను పొందుతున్నారు. గర్భిణులు 7,669 మంది, బాలిం తలు 10,315 మంది, ఆర్నేళ్లులోపు చిన్నారులు 8,989 మంది, 7 నెలలు నుంచి 36 నెలల వయస్సు కలిగిన చిన్నారులు 48,810 మంది, 3 నుంచి 5 ఏళ్లలోపు చిన్నారులు 48,295 మంది సేవలు పొందుతున్నారు. ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో నూతన విధానం అమలుకు కసరత్తు చే స్తున్నారు. ఇప్పటికే కేంద్రాలకు పంపిణీ చేసే కోడిగుడ్లపైనే వారానికి ఒక ముద్రతో సరఫరా చేస్తున్నారు. అంగన్‌వాడీ టీచర్ల, ఆయాలకు వేతనాలు పెంపుదలతో వారిలో జవాబుదారీ తనం పెంచడానికి ఈ విధానం దోహదం చేయనుంది.
ఇప్పటి వరకు ఆ రెండు యాప్‌ల్లోనే..
ప్రస్తుతం బాల సంజీవని యాప్‌లో రాష్ట్ర ప్రభుత్వం గర్భిణులు, బాలింతలు, మూడు ఏళ్లలోపు చిన్నారుల ముఖ గుర్తింపు నమోదు చేస్తున్నారు. తొలుత కేంద్ర పర్యవేక్షణ లోని పోషణ్ ట్రాకర్ యాప్‌లోనే దాన్ని నమోదు చేసి, బాలసంజీవిని యాప్‌లో ఫొటోతో సహా నమోదవుతుం డ డంతో క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులుండవుని భావిం చినా సర్వర్లు మొరాయించడంతో పాత విధానంలో చేయా ల్సిన రావడంతో ఇప్పుడు తాజాగా ఫేస్ ఫేస్ రికగ్నిషన్ విధానంకు నాంది పలికారు. దీంతో సరుకుల పంపిణీ అస లైన లబ్ధిదారులకు చేరతాయి. గర్భిణులు, బాలింతలు, చిన్నా రులకు పోషకాహారం పంపిణీ ఏ మేర జరుగుతుందో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల నుంచి పర్యవేక్షించడం సులభం కానుంది. కొన్ని కేంద్రాల్లో ఇప్పటికే ప్రయోగాత్మకంగా నమోదు ప్రక్రియ ప్రారంభించగా విజయవంతమైనట్టు అధికా రులు చెబుతున్నారు. మూడు నుంచి ఆరేళ్లలోపు చిన్నారులకు కేంద్రాల్లో మధ్యాహ్నం భోజనం వండించే సమయంలో ఫొటో తీసి ఆ వివరాలను పోషణ్ ట్రాకర్‌లో నమోదు చేయనున్నారు. ఆగస్టు 1 నుంచి అందరికి నూరుశాతం ముఖ ఆధారిత గుర్తింపును చేపట్టనున్నారు.