రోజూ ప్రత్యేక మెనూ
ABN , Publish Date - Jun 13 , 2025 | 12:42 AM
విద్యార్థులకు పౌష్ఠికాహారం లోపం లేకుండా ఉండేలా మధ్యాహ్న భోజనంలో ప్రతిరోజు ప్రత్యేక మెనూను అమలు చేస్తున్నట్టు పబ్లిక్‌అకౌంట్స్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజి బాబు), జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి తెలిపారు.
డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని
ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు, జేసీ రాహుల్
భీమవరం రూరల్, జూన్ 12(ఆంధ్రజ్యోతి):విద్యార్థులకు పౌష్ఠికాహారం లోపం లేకుండా ఉండేలా మధ్యాహ్న భోజనంలో ప్రతిరోజు ప్రత్యేక మెనూను అమలు చేస్తున్నట్టు పబ్లిక్‌అకౌంట్స్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజి బాబు), జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి తెలిపారు. భీమవరం పీఎస్‌ఎం బాలికోన్నత మునిసిపల్ హైస్కూల్‌లో సన్న బియ్యం తో తయారుచేసిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. భోజనం నాణ్యతను విద్యార్థినులను అడిగి తెలుసుకుని, వారితో కలిసి భోజనం చేశారు. భోజనం నాణ్యత పై వారు సంతృప్తి వ్యక్తం చేశారు. అంజిబాబు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యా బోధనతోపాటు పౌష్టికాహారంతో కూడిన భోజనాన్ని అందించడమే లక్ష్యమన్నారు. జేసీ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేం ద్రాలను తనిఖీ చేస్తానని, ఎక్కడైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. విద్యార్థులకు పుస్తకాలు, స్కూల్ బ్యాగ్‌లను అందించారు. ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి, ఆర్డీవో ప్రవీణ్ కుమార్‌రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.