సెల్‌ఫోన్‌తో దర్జాగా చినవెంకన్న ఆలయంలోకి..
ABN , Publish Date - Nov 22 , 2025 | 12:55 AM
చినవెంకన్న మూల విరాట్ ను ఓ భక్తుడు సెల్‌ఫోన్ ద్వారా ఫొటోలను తీసి తన వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకోవ డం స్థానికంగా కలకలం రేపింది.
తీవ్ర దుమారం రేపిన ఘటన
ద్వారకా తిరుమల, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): చినవెంకన్న మూల విరాట్ ను ఓ భక్తుడు సెల్‌ఫోన్ ద్వారా ఫొటోలను తీసి తన వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకోవ డం స్థానికంగా కలకలం రేపింది. భక్తుడు తన సెల్ ఫోన్‌తో ఫొటో తీయడం చర్చనీయాంశమైంది. సాధా రణంగా భక్తులు ఆలయం లోకి ప్రవేశించే ముందే సెక్యూరిటీ సిబ్బంది క్షుణంగా తనిఖీ చేసి భక్తులను పంపాల్సి ఉంది. ఇదే క్రమంలో ఆలయ అలివేటి మండపం వద్ద భక్తులకు సెల్‌ఫోన్ కౌంటర్‌ను దేవవస్థానం నిర్వహిస్తోంది. అయినా కామవరపుకోటకు చెందిన ఓ భక్తుడు సెల్‌ఫోన్‌ను లోపలకు తీసుకెళ్లడ మే కాకుండా, ఫొటో తీసి తన వాట్సాప్ స్టేటస్‌లో పెట్టుకున్నాడు. భద్రతా వైఫల్యం కారణంగానే అతను సెల్‌ఫోన్‌తో ఆలయంలోకి ప్రవేశించాడని భావిస్తున్నారు. ఈ ఘటనపై దేవదాయశాఖ అధికారులు, పాలకవర్గం ఏ చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాల్సిందే.