Share News

తీరనున్న దాహార్తి

ABN , Publish Date - Nov 10 , 2025 | 01:33 AM

జంగా రెడ్డిగూడెం పట్టణానికి ఎర్రకాలువ జలాశయం నుంచి శుద్ధి చేసిన మంచినీటిని ఇంటింటికీ కుళాయిల ద్వారా అందించడానికి మార్గం సుగమం అయ్యింది.

తీరనున్న దాహార్తి

రూ.101 కోట్లతో ఏఐఐబీ మంచినీటి పఽథకానికి మార్గం సుగమం

టెండరు దశలో పఽథకం.. పూర్తవ్వగానే పనులు ప్రారంభం

జంగారెడ్డిగూడెం నవంబరు 9(ఆంధ్రజ్యోతి): జంగా రెడ్డిగూడెం పట్టణానికి ఎర్రకాలువ జలాశయం నుంచి శుద్ధి చేసిన మంచినీటిని ఇంటింటికీ కుళాయిల ద్వారా అందించడానికి మార్గం సుగమం అయ్యింది.రూ.101.16 కోట్లతో చేయబోయే ఈ భారీ మంచినీటి పఽథకం ప్రస్తు తం టెండరు దశలో ఉంది. ఇది పూర్తయితే పట్టణంలో మంచినీటి వెతలకు చెక్‌ పడనుంది.

2018లో అంకురార్పణ

పట్టణంలో పెరుగుతున్న జనాభా ప్రకారం మున్సి పాలిటీ తరపున ప్రజలకు మంచినీటిని పూర్తి స్థాయిలో సరఫరా చేయలేక పోతున్నారు. ఈ తరుణంలో పట్టణ ప్రజలకు పూర్తిస్థాయిలో మంచినీటిని అందించడానికి 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వంలో ఏషియన్‌ ఇన్‌ఫ్రాస్ట్ర క్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకు (ఏఐఐబీ) ద్వారా రూ.80.95 కోట్లు మంజూరు చేసింది. తాజాగా రీ ఎస్టి మేట్‌ వేసి అధికారులు పంపించగా రూ.85.38 కోట్లు మంజూరు చేశారు. దీనికి జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ నుంచి ఏడేళ్ల వరకు ప్రాజెక్టు నిర్వహణ ఖర్చు రూ.15.78 కోట్ల నిధులు కలిపి మొత్తం రూ.101.16 కోట్లతో ఈ మంచినీటి పథకం నిర్మాణం కానుంది.ముందుగా ఎర్ర కాలువ జలా శయం వద్ద సుమారు రూ.60 కోట్లతో ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసి ఆ ప్లాంట్‌ ద్వారా జలాశయం నీటి ని శుద్ధి చేసి జంగారెడ్డిగూడెం వరకు పైప్‌లైన్‌ వేసి పట్టణంలోని ప్రతీ ఇంటికీ శుద్ధి చేసిన మంచి నీరు ఇవ్వాలనేదే ఈ పఽథకం ముఖ్య లక్ష్యం. ఇప్పటికే దాదాపు ఐదు కిలోమీటర్ల మేర పట్టణంలో పైప్‌లైన్‌ వేశారు.ఎర్రకాలువ జలాశయం నుంచి పైప్‌లైన్ల ద్వారా పట్టణంలో ఎంపిక చేసిన సాయి బాలాజీ టౌన్‌షిప్‌, మున్సిపల్‌ కార్యాలయం, బాలాజీ నగర్‌, ఉప్పలమెట్ట, డాంగే నగర్‌ వద్ద ఓవర్‌హెడ్‌ వాటర్‌ ట్యాంకులు నిర్మించి అక్కడి నుంచి పైప్‌ లైన్ల ద్వారా ఇంటింటికీ మంచినీటిని అందచేస్తారు. ఈ పఽథకాన్ని గత వైసీపీ ప్రభుత్వంలో పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పథకాన్ని గాడిలోకి తెచ్చారు. ప్రస్తుతం ఈ పథకం టెండరు దశలో ఉందని టెండరు పూర్తవగానే పనులు ప్రారంభిస్తామని పబ్లిక్‌ హెల్త్‌ ఈఈ కె.ఫణిభూషణ రావు తెలిపారు.

శుద్ధి చేసిన మంచినీటిని అందజేస్తాం

పట్టణంలో సుమారు పదివేల కుళాయిల ద్వారా శుద్ధి చేసిన మంచినీటిని ప్రజలకు అందచేస్తాం. ప్రస్తుతం ప్రజలకు మంచినీరు అందించడానికి బోర్లు, మోటార్లు రిపేర్లు, కొత్తవి కొనడంతో పాటు విద్యుత్‌ బిల్లులు చెల్లించడానికి ఏటా రూ.3కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఏఐఐబీ పథకం డైరెక్టు పంపింగ్‌ స్కీము కావడంతో విద్యుత్‌ బిల్లుల సమస్య ఉండదు. మున్సిపాలిటీ ఏడాదికి రెండు కోట్లు పథకం మెయింటెనెన్స్‌ కోసం ఖర్చు చేసినా రూ.కోటి మేర మిగిలే అవకాశాలున్నాయి.

– కేవీ రమణ, మున్సిపల్‌ కమిషనర్‌, జంగారెడ్డిగూడెం

Updated Date - Nov 10 , 2025 | 01:33 AM