Share News

ఇంజనీర్లు లేరు!

ABN , Publish Date - Nov 26 , 2025 | 12:22 AM

జల వనరుల శాఖలో ఇంజనీర్ల కొరత వేధిస్తోంది. ఏళ్ల తరబడి ఖాళీలు భర్తీ కాకపోవడంలో కీలకమైన మైనర్‌, మేజర్‌ ప్రాజెక్టుల పర్యవేక్షణ కష్టతరంగా మారింది.

ఇంజనీర్లు లేరు!

జలవనరుల శాఖలో కొరవడిన పర్యవేక్షణ

29 మందికి ఉన్నది 8 మంది మాత్రమే

మైనర్‌, మేజర్‌ ప్రాజెక్టుల్లో ఇక్కట్లు

అక్రమార్కుల మట్టి, ఇసుక దందా

(ఏలూరు–ఆంధ్రజ్యోతి)

జల వనరుల శాఖలో ఇంజనీర్ల కొరత వేధిస్తోంది. ఏళ్ల తరబడి ఖాళీలు భర్తీ కాకపోవడంలో కీలకమైన మైనర్‌, మేజర్‌ ప్రాజెక్టుల పర్యవేక్షణ కష్టతరంగా మారింది. వరదలు, తుఫాన్‌ సమయంలో అధికారు లు నానా తంటాలు పడుతున్నారు. చెరువులు, సమీ పంలో కాల్వ పరిసరాల్లో మట్టి, ఇసుక అక్రమ తవ్వ కాలను అడ్డుకోలేకపోతున్నారు. జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పొరుగు జిల్లాలోనే ఉన్న ఇంజనీర్ల కొరతకు చెక్‌ పడడం లేదు. సాగు, తాగునీరుతోపాటు పశువులకు నీరందించే జలవన రుల శాఖలో ఇంజనీర్ల కొరత తీవ్రంగా ఉంది. జిల్లా ల విభజన జరిగిన తర్వాత, అంతముందు నుంచి ఏ ఒక్క ఖాళీ భర్తీ చేయలేదు. కోట రామచంద్రాపురం లోని మైనర్‌ ఇరిగేషన్‌ డివిజన్‌లో 14 మంది అసిస్టెంట్‌ ఇంజనీర్లు పనిచేయాల్సి ఉండగా కేవలం నలుగురు ఉన్నారు. ప్రధానంగా జల్లేరు రిజర్వాయర్‌ కింద 4200 ఎకరాలు, పోగొండ రిజర్వాయర్‌ కింద 7,650 ఎకరాలకు, బైనేరు వాగుకింద స్వల్పంగా సాగునీటి సరఫరా జరుగుతుంది. నలుగురు ఇంజ నీర్లతో పర్యవేక్షణ సాధ్యంకాదు. అరకొరగా ఉన్న లస్కర్లపైనే ఆధార పడుతున్నారు. ప్రధానంగా ఈ మూడు ప్రాజెక్టుల కింద వేల ఎకరాల భూమిలో వివిధ పంటలు సాగవుతుంటాయి. మీడియం ఇరిగేషన్‌ ఏలూరు ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ కార్యాలయం పరిధిలో తమ్మిలేరు రిజర్వాయర్‌లో 32వేల ఎకరాలు ఎర్రకాల్వ కింద 24,700 ఎకరాలు, కొవ్వాడలంక 8వేలు ఎకరాల పంటలకు సాగు నీరు అందుతుంది. ఇక్కడ మూడు ప్రాజెక్టుల కింద మొత్తం 15 మంది ఇంజనీర్లు పనిచేయాల్సి ఉంది. కేవలం నలుగురే ఏఈలు ఉన్నారు. ప్రాజెక్టుల పరిధిలో షట్టర్లు, లాకుల మరమ్మతుల ప్రతిపాద నలు సకాలంలో పంపలేకపోతున్నారు. పలుచోట్ల లీకేజీలతో ప్రాజెక్టుల వద్ద నీటివృథా జరుగుతోంది.

మట్టి, ఇసుక అక్రమాలు

నదులు, వాగులు, రిజర్వాయర్ల పరిసరాల్లో ఇసుక అక్రమంగా తవ్వేస్తున్నారు. ఏఈల కొరత వలనే సహజ సంపద అక్రమార్కుల పాలవుతోంది. జల వనరుల శాఖ ఇంజనీర్లు రెవెన్యూ, పోలీస్‌ అధికారులతో మాట్లాడి అడ్డుకోవాల్సి ఉంది. అవసరమైతే కేసులు పెట్టించాల్సి ఉంది. పర్యవేక్షణ కొరవడడంతో చెరువుల్లో సైతం మట్టి తవ్వకాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. తమ్మిలేరులో అక్రమా ర్కులు ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలతో భారీగా కూడబెట్టుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

చెరువుల అభివృద్ధి కష్టమే..

ఏలూరు జిల్లాలో 1,513 ఇరిగేషన్‌ చెరువులు ఉన్నాయి. వీటి అభివృద్ధికి ట్రిపుల్‌ ఆర్‌ పథకంలో జిల్లా యంత్రాంగం సకాలంలో ప్రతిపాదనలు పంపడంలో విఫలమవుతోంది. ఏఈల కొరత కార ణంగా జాప్యంతో అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకంలో చెరువుల మరమ్మతులు, అభివృద్ధి, పునరుద్ధరణకు ఇటీవలే నడుంబిగించింది. ఇప్పటికే 18 నెలలు గడిచిపో యాయి. కీలకమైన ఇంజనీర్ల కొరత వలనే ఈ నిధులు సకాలంలో జిల్లాకు వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వరదల వలన ఏ చెరువుకు ఎప్పుడు గండి పడుతుందో అర్థం కాని అయోమయస్థితి నెలకొంది. ఇటీవల మొంథా తుఫాన్‌లో చెరువుల వద్ద జల వనరుల శాఖ అధికారులు పోలీస్‌ శాఖతోనే రక్షణ చర్యలు, పర్యవేక్షణ చేపట్టారు.

Updated Date - Nov 26 , 2025 | 12:22 AM