ఆర్టీసీ ఆస్తులను ధారాదత్తం చేస్తే ఊరుకోం
ABN , Publish Date - Aug 05 , 2025 | 11:54 PM
ప్రజారవాణా(ఆర్టీసీ) ఆస్తులను ప్రైవేట్ వ్యాపారవేత్తలకు ధారాదత్తం చేస్తే ఊరుకునేది లేదని, ఐక్యంగా ఉద్యమిస్తామని ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ) రీజనల్ కార్యదర్శి బి.రాంబాబు అన్నారు.
ఈయూ రీజనల్ కార్యదర్శి రాంబాబు హెచ్చరిక
ఏలూరు, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి):ప్రజారవాణా(ఆర్టీసీ) ఆస్తులను ప్రైవేట్ వ్యాపారవేత్తలకు ధారాదత్తం చేస్తే ఊరుకునేది లేదని, ఐక్యంగా ఉద్యమిస్తామని ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ) రీజనల్ కార్యదర్శి బి.రాంబాబు అన్నారు. ఏలూరు జిల్లా కేంద్రం ఏలూరులోని కపర్థీ భవన్‌లోని ఈయూ కార్యాలయంలో మంగళ వారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విజయవాడ నగరం నడిబొడ్డున ఉన్న ఏపీఎస్ ఆర్టీసీ గవర్నర్‌పేట డిపోలు, పాతబస్టాండ్‌కు సంబంధించిన 15 ఎకరాలు కలిపి రూ.400 కోట్ల విలువైన స్థలం లులూ షాపింగ్‌మాల్‌కు ప్రభుత్వం కట్టబెట్టాలని చూస్తోందన్నారు. ఈ రెండు డిపోల పరిధిలో 1,100 మంది ఉద్యో గులను ప్రజలకు దూరం చేయాలన్న కుట్రలను భగ్నం చేస్తా మన్నారు. వెంటనే స్థలం కేటాయింపు జీవో 137 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో ఈ ప్రభుత్వ పెద్దలే 2014లో విజ యవాడ ఆర్టీసీ ట్రైనింగ్ కళాశాల స్థలం 29 ఎకరాలను హెచ్‌ఈఎల్ కంపెనీకి కట్టబెట్టారని, అందుకు బదులుగా ప్రభుత్వం ఇస్తామన్న స్థలం ఇప్పటివరకు ఒక్క గజం ఇవ్వలేదని గుర్తుచేశారు. ఆర్టీసీని కాపాడుకునేందుకు ఏ పోరాటాలకైనా సిద్ధంగా ఉంటామని తెలిపా రు. కేవీ రాఘవులు, వై.శ్రీనివాస్, టి.ఆంజనేయులు, టి.బాబూరావు, పాండు, నూజివీడు సెక్రటరీ కుమార్ పాల్గొన్నారు.