ప్రకృతి పంట
ABN , Publish Date - Sep 03 , 2025 | 12:44 AM
పట్టణానికి చెందిన వుడుమూడి బంగార్రాజు కేంద్రంలో మహిళా శిశు సంక్షేమ శాఖలో డిప్యూటీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ.. ప్రకృతి వ్యవసాయం
స్వగ్రామంలో వరితో పాటు జామ తోట.. తేనెటీగల పెంపకం
తృణ ధాన్యాలు, ధాన్యం, ఇతర పదార్థాల స్టాల్ ఏర్పాటు
ఆయన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి.. ఆఫీసు, ఇల్లు ఉద్యోగ జీవితం సాఫీగా సాగుతోంది. కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్థన్ వద్ద అదనపు వ్యక్తిగత కార్యదర్శిగా విధులు నిర్వరిస్తున్న సమయంలో ఆ మంత్రి హాజరైన సమావేశాలు ఆయన్ను ఎంతగానో ప్రభావితం చేశాయి. వ్యవసాయంపై ఆయన దృష్టి మళ్లింది. తాడేపల్లిగూడెం మండంల దండగర్రలో ఐదు ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేపట్టారు. తర్వాత వెంకట్రామన్నగూడెంలో నాలుగెకరాల్లో జామ తోట వేశారు. ఆయన పేరు వుడుమూడి విరాట్ బంగార్రాజు. తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన చెందిన బంగార్రాజు మహిళా శిశు సంక్షేమ శాఖలో డిప్యూటీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. రెండేళ్లలో ఉద్యోగ విరమణ తర్వాత పూర్తిగా వ్యవసాయం చేస్తానని చెబుతున్నారు. రైతులు అంతా ప్రకృతి వ్యవసాయం చేయడానికి ప్రోత్సహిస్తానని ఆయన ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు.
తాడేపల్లిగూడెం రూరల్, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): పట్టణానికి చెందిన వుడుమూడి బంగార్రాజు కేంద్రంలో మహిళా శిశు సంక్షేమ శాఖలో డిప్యూటీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. వెంకట్రామన్నగూడెం, దం డగర్రలో ప్రకృతి వ్యవసాయం పద్ధతుల్లో వరి, జామ తోటలు సాగు చేస్తున్నారు. దండగర్రలో 5 ఎకరాల వ్యవసాయ భూమి కొనుగోలు చేసి ప్రకృతి వ్యవసా యం చేస్తున్నారు. తర్వాత వెంకట్రామన్న గూడెంలో మరో 4 ఎకరాలు కొనుగోలు చేసి సేంద్రియ పద్ధతిలో జామ తోట సాగుచేస్తూ మిగిలిన రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. తమ తాతల సమయంలో వ్యవసా యం చేసేవారని, తాను కూడా వ్యవసాయం చేయా లనుకున్నట్లు చెబుతున్నారు. తన సర్వీసులో కొన్ని సమావేశాల ప్రభావం సమాజంలో ఆరోగ్యానికి ఉన్న ప్రాధాన్యత తనను ప్రకృతి వ్యవసాయం వైపు నడిపించినట్లు వివరించారు. అనుకున్నదే తడవుగా ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ తీసుకుని సాగు ప్రారంభించారు. తన సోదరులతో కూడా ప్రకృతి సాగు చేయిస్తున్నారు. కుటుంబానికి సరిపడా వస్తువులతో పాటు స్టాల్ కూడా నిర్వహిస్తున్నారు.
తోటి వారికి అందించాలని..
ప్రకృతి వ్యవసాయ ఫలాలు కొంత ఖర్చు అని తెలిసినా రైతులకు ఆ ఫలాలు అందించాలని.. వారు కూడా ఆ దిశగా ముందుకు రావాలని తన ప్రయత్నం అన్నారు. రైతులు ఆరోగ్యకరమైన ఉత్పత్తులు అందిం చే స్థాయికి చేరాలని బంగార్రాజు చెబుతున్నారు.
సేంద్రియ ఎరువుల తయారీ..
సేంద్రియ ఎరువుల తయారీకి సొంతంగా పుల్లటి మజ్జిగ, జీవామృతం, పంచగవ్యం తయారు చేయడం ద్వారా సాగుచేస్తున్నారు. అవసరమైతే జీవ ఎరువుల తయారీకి తోటి రైతులకు సూచనలు సలహాలు అందిస్తానని బంగార్రాజు చెబుతున్నారు. ప్రకృతి వ్యవసాయంతో అందరికీ ఆరోగ్యంతో పాటు పర్యా వరణ పరిరక్షణకు దోహదం చేస్తుందంటున్నారు.
జామ.. తేనె.. పప్పుల స్టాల్
వరితోపాటు జామ, పుట్ట తేనె, ప్రకృతి వ్యవసా యంలో తనతో శిక్షణ పొందిన ఇతర రాష్ట్రాల రైతుల నుంచి కందిపప్పు, మినప్పప్పు, ఇతర ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు, గిరిజనుల సం ప్రదాయ వ్యవసాయం ద్వార వచ్చిన ఉత్పత్తులను విక్రయించేందుకు ఓ మాదిరి స్టాల్‌ను ఏర్పాటు చేయడం గమనార్హం.
మరిన్ని పంటలు సాగు చేస్తా
ఉద్యోగ జీవితం మరో రెండేళ్లు ఉంది. తరువాత పూర్తిస్థాయిలో ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సా రించి మరిన్ని పంటలు సాగు చేస్తా. రైతులు వ్యవసాయం ప్రకృతి సేద్యం చేయకపోయినా వారి కుటుంబ అవసరాలకు సరిపడా పండిస్తే ఆ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది.
– వుడుమూడి విరాట్ బంగార్రాజు, రైతు