Share News

ప్రజా రక్షణకే పోలీసులు

ABN , Publish Date - Apr 19 , 2025 | 12:38 AM

పోలీసులు ప్రజా రక్షణకు కట్టుబడి ఉంటారని ఏలూరు రేంజ్‌ ఐజీ జీవిజీ అశోక్‌కుమార్‌ అన్నారు.

ప్రజా రక్షణకే పోలీసులు
ఏలూరులో వాహనాల తనిఖీ చేస్తున్న పోలీసులు

ఏలూరు రేంజ్‌ ఐజీ అశోక్‌ కుమార్‌

ఏలూరు క్రైం, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి) : పోలీసులు ప్రజా రక్షణకు కట్టుబడి ఉంటారని ఏలూరు రేంజ్‌ ఐజీ జీవిజీ అశోక్‌కుమార్‌ అన్నారు. జిల్లా వ్యాప్తంగా గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకూ అన్ని ప్రధాన రహదారులపై పోలీసులు నాకా బందీ నిర్వహించారు. ఏలూరు పాత బస్టాండ్‌ వద్ద వాహనాల తనిఖీ తీరును ఐజీ అశోక్‌కుమార్‌ పరిశీలించా రు. ఎస్పీ కేపీఎస్‌ కిశోర్‌ స్వయంగా వాహనాల తనిఖీల్లో పాల్గొన్నారు. ఐజీ అశోక్‌కుమార్‌ మాట్లాడుతూ పోలీసుల ప్రధాన లక్ష్యం కేవలం నేరాలను నివారించడమే కాదని ప్రజలందరికి సురక్షిత వాతావరణాన్ని కల్పించడమేనన్నారు. ఎస్పీ కిశోర్‌ మాట్లాడుతూ భవిష్యత్‌లో నాకా బందీ కార్య క్రమాలు క్రమం తప్పకుండా నిర్వహిస్తామని కట్టుదిట్టమైన చర్యలు చేపడతామన్నారు. ప్రజల సహకారంతో జిల్లాలో మత్తుపదార్థాల నివారణ, శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్‌ శాఖ నిరంతరం కృషి చేస్తుందన్నారు. ప్రజల భద్ర త, నేరాలను నియంత్రించడం, నైతిక పోలీసింగ్‌ను ప్రోత్సహించడం లక్ష్యంఅన్నారు. డీఎస్పీ శ్రావణ్‌కుమార్‌, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

జంగారెడ్డిగూడెం ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ తనిఖీ

జంగారెడ్డిగూడెం: వార్షిక తనిఖీలలో భాగంగా జంగారెడ్డిగూడెం ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ను ఐజీ అశోక్‌కుమార్‌ శుక్రవారం తనిఖీ చేశారు. స్టేషన్‌లో దస్త్రాలను ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని, క్రైం రేటు కూడా పెరుగుతుందన్నారు. ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఎస్సై పోస్టు త్వరలో భరీ చేస్తామని, సిబ్బందిని నియమిస్తామన్నారు. చింతలపూడి, జంగారెడ్డిగూడెంలో పోక్సో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని, చర్యలు తీసుకుంటా మ న్నారు. అనంతరం స్టేషన్‌ ప్రాంగణంలో ఐజీ, ఎస్పీ కె.ప్రతాప్‌ కిశోర్‌ మొక్కలు నాటారు. డీ ఎస్పీ యు.రవిచంద్ర, సీఐ కృష్ణబాబు, ఎస్సైలు జబీర్‌, శశాంక, కుటుంబరావు పాల్గొన్నారు.

కామవరపుకోట: పోలీసులు అంకితభావం తో విధులు నిర్వహించాలని ఐజీ అశోక్‌కుమార్‌ అన్నారు. ఎస్పీ ప్రతాప్‌ కిశోర్‌తో తడికలపూడి పోలీసుస్టేషన్‌ సందర్శించారు. రికార్డులు పరిశీ లించి కేసుల పరిష్కారంపై పోలీసు సిబ్బందికి సూచనలు ఇచ్చారు. ట్రాఫిక్‌ నియంత్రణ, రాత్రి నిఘా పెంచాలని, గంజాయి, మత్తు పదార్థాల రవాణా అరికట్టాలన్నారు. స్టేషన్‌ ప్రాంగణంలో ఐజీ మొక్కలు నాటారు. వారి వెంట జంగా రెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర. ఎస్‌ఐ పి. చిన్నా రావు, ఏఎస్‌ఐ వీరాస్వామి, రైటర్‌ సుధీర్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Apr 19 , 2025 | 12:38 AM