Share News

రైల్వే ట్రాఫిక్‌ నివారణకు ఓవర్‌ బ్రిడ్జిలు కావాలి

ABN , Publish Date - Aug 08 , 2025 | 12:36 AM

ఏలూరు పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో రైల్వే ట్రాక్స్‌ వద్ద ట్రాఫిక్‌ సమస్యలను పరిష్కరించేందుకు రైల్వే ఓవర్‌ బ్రిడ్జిల నిర్మాణం అవసరమని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌కుమార్‌ కోరారు.

రైల్వే ట్రాఫిక్‌  నివారణకు ఓవర్‌ బ్రిడ్జిలు కావాలి
మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి వినతి పత్రం అందిస్తున్న ఏలూరు ఎంపీ పుట్టా

కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన ఎంపీ మహేశ్‌

ఏలూరు, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి):ఏలూరు పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో రైల్వే ట్రాక్స్‌ వద్ద ట్రాఫిక్‌ సమస్యలను పరిష్కరించేందుకు రైల్వే ఓవర్‌ బ్రిడ్జిల నిర్మాణం అవసరమని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌కుమార్‌ కోరారు. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల సందర్భంగా రైల్వే మంత్రిని గురువారం ఆయన కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ వివరిస్తూ నియోజకవర్గ పరిధిలో 12 ముఖ్యమైన ప్రధాన రైల్వే లెవెల్‌ క్రాసింగ్‌లున్నాయని, ఇవి అప్‌ల్యాండ్‌, డెల్టాను కలుపుతూ ఉ న్నందున భారీగా ట్రాఫిక్‌ ఝామ్‌కు కారణం అవుతున్నాయన్నారు. భీమడో లు లెవెల్‌ క్రాసింగ్‌, కైకరం, చేబ్రోలు, ఉంగుటూరు, పవర్‌పేట, పంగిడిగూ డెం, సీతం పేట, పూళ్ల, బాదంపూడి వద్ద ఆర్‌వోబీలు అవసరమని, వట్లూరు రైల్వేగేటు వద్ద అండర్‌ పాస్‌ నిర్మాణానికి సంబంధించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఇవే కాకుండా నాలుగు ప్రధాన లెవెల్‌ క్రాసింగ్‌లు ఆటపాక– వరాహా పట్నం, వదర్లపాడు బ్రాంచ్‌, పల్లెవాడ–రామవరం బ్రాంచ్‌, కొక్కిర్లపాడు రైస్‌మిల్లు లెవెల్‌ క్రాసింగ్‌ వద్ద ఉన్న సమస్యలను మంత్రి వైష్ణవ్‌కు వివరిం చారు. వీటిని ప్రాధాన్యతా క్రమంలో అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు వేగంగా చర్యలు తీసుకుంటామని మంత్రి ఎంపీకి హామీ ఇచ్చారు.

తప్పుడు ప్రచార వ్యాప్తికి తీసుకున్న చర్యలేవి : ఎంపీ పుట్టా

తప్పుడు సమాచార వ్యాప్తి, నియంత్రణ కోసం కేంద్రప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందని పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల సందర్భంగా ఏలూ రు ఎంపీ పుట్టా మహేశ్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర, సమాచార, ప్రసార మంత్రి డాక్టర్‌ మురుగన్‌ లిఖితపూర్వక సమాచారాన్ని అందించారు. ప్రింట్‌ మీడియా, టీవీ, డిజిటల్‌ మీడియాలకు నిబంధనలు ఉన్నాయని మంత్రి వెల్లడించారు.

Updated Date - Aug 08 , 2025 | 12:36 AM