Share News

ఈకే వైసీతో బినామీలకు చెక్‌

ABN , Publish Date - Apr 19 , 2025 | 12:41 AM

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సొసైటీల్లో బినామీ రైతుల ఏరివేతకు ఈకేవైసీ చెక్‌ పెట్టనుంది. ఉమ్మడి గోదావరి జిల్లా పరిధిలోని పశ్చిమ, తూర్పు, ఏలూరు జిల్లాల్లోని 258 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల్లో (పీఏసీఎస్‌) వ్యక్తిగత వివరాలతో ఈకేవైసీ కొలిక్కి తెస్తున్నారు.

ఈకే వైసీతో బినామీలకు చెక్‌

సహకార సంఘాల్లో 80 శాతం పైగా పూర్తి

త్వరలో బినామీలు, డెత్‌ కేసుల్లో నకిలీల ఏరివేత

ఇకపై అర్హులకే ఓట్లు

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సొసైటీల్లో బినామీ రైతుల ఏరివేతకు ఈకేవైసీ చెక్‌ పెట్టనుంది. ఉమ్మడి గోదావరి జిల్లా పరిధిలోని పశ్చిమ, తూర్పు, ఏలూరు జిల్లాల్లోని 258 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల్లో (పీఏసీఎస్‌) వ్యక్తిగత వివరాలతో ఈకేవైసీ కొలిక్కి తెస్తున్నారు.

(ఏలూరు–ఆంధ్రజ్యోతి)

ఏలూరు కేంద్ర బ్యాంకు పరిధిలోని 80 శాతం పైగా ఈకేవైసీ పూర్తి కావడంతో రాబోయే ఎన్ని కలకు సభ్యత్వం ఉన్న వారే ఓటర్లు కానున్నారు. సొసైటీల్లో రైతుల కింద రూ.300 సభ్యత్వంతో నమోదు చేయించుకుని బినామీలు రుణాలను అడ్డగోలుగా తీసుకునేవారు. వీరి సంఖ్యపై ఒక ప్పుడు ఎన్నో ఆరోపణలు ఉండేవి. తాజాగా సొసై టీల కంప్యూటరీకరణతో వారి సంఖ్యపై స్పష్టత వస్తోంది. ఈ నెలాఖరుకు మరణించిన వారు, బినామీలను తొలగించనున్నారు. దీనిపై సహకర శాఖ అదికారుల కసరత్తులు చేస్తున్నారు.

4.39 లక్షలకు 3.64 లక్షలు పూర్తి

ఉమ్మడి జిల్లాలో 4,39,839 మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. ఇందులో 3,64,167 మంది రైతుల ఖాతాలను ఈకేవైసీ చేశారు. 70,432 మందికి ఇంకా పూర్తిచేయాలి.

ఏలూరు జిల్లాలో 1,68,895 మందికి 1,39,243 మందికి పూర్తిచేశారు. 29,612 మంది ఖాతాల లెక్కలు తేలాలి.

పశ్చిమలో 1,54,849 మందికి 1,26,956 మందికి పూర్తి చేయగా, ఇంకా 27,893 మంది రైతులకు ఈకేవైసీ చేయాలి.

తూర్పులో 1,16,895 మందికి గాను 97,968 మందికి పూర్తయ్యాయి. ఇంకా 18,276 మంది రైతులు మిగిలారు.

కమిటీల ఎన్నిక ఎప్పుడు ?

గతంలో రూ.10 వాటాధనం చెల్లిస్తే సరిపో యేది. 2020లో రూ.300 వాటా ధనంగా నిర్దేశిం చారు. అప్పటికే మెజారిటీ సభ్యులకు రూ.10 వాటా ధనం ఉండగా, వారు మిగిలిన మొత్తాన్ని చెల్లిస్తేనే సభ్యత్వం ఉంటుందని చెప్పడంతో కొం దరు చెల్లించారు. కొత్తగా సభ్యత్వం పొందడానికి కొన్ని నిబంధనలు విధించడంతో అనధికారిక సభ్యులు సంఖ్య తగ్గుతూ వచ్చింది. సొసైటీలకు 2013లో చివరిసారిగా ఎన్నికలు జరిగాయి. 2018లో కాల పరిమితి తీరిపోవడంతో ఆరు నెలల చొప్పున ఏడాది వరకు పాత పాలకవర్గా లు కొనసాగుతూ వచ్చాయి. ఈ స్థానంలో వైసీ పీ ప్రభుత్వం నామినేటెడ్‌ కమిటీలను నియమిం చింది. 2019 ఆగస్టులో త్రిసభ్య డీసీఎంఎస్‌, డీసీ బీబీకి ఏడుగురు సభ్యుల కమిటీలు ఏర్పాటయ్యా యి. ఆరు నెలలకు ఒకమారు కాల పరిమితి పొడిగిస్తూ ఈ కమిటీలను కొనసాగించారు. కమిటీ స్థానంలో తెలుగుదేశం ప్రభుత్వం పర్సన్‌ ఇన్‌ఛార్జులను నియమించింది. ఈకేవైసీపై జిల్లా సహకార అధికారి ఆరిమిల్లి శ్రీనివాస్‌ను వివరణ కోరగా నెలాఖరు నాటికి ఈకేవైసీ పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నామని వివరించారు. బినామీ రైతులను తొలగించేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

సభ్యులయ్యేందుకు..

సహకార సంఘాల్లో సభ్యులు కావాలంటే తొలుత రైతుగా గుర్తింపు పొందాలి.

కనీసం పది సెంట్ల భూమి కలిగి ఉండాలి.

ఏడాదిపాటు సొసైటీలో ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేయాలి.

అప్పు తీసుకోవడం లేదా డిపాజిట్‌ చేయాలి.

బకాయిదారునిగా ఉండకూడదు.

ఎన్నికల ప్రకటనకు 30 రోజుల ముందు సభ్యత్వం తీసుకోవాలి.

Updated Date - Apr 19 , 2025 | 12:41 AM