గుడ్డు అ‘ధర’హో
ABN , Publish Date - Sep 04 , 2025 | 12:37 AM
కోడ్డు గుడ్డు ధరలు భారీగా పెరిగాయి. వరుస నష్టాలు చవిచూస్తున్న రైతులకు పెరిగిన ధరతో కాస్త ఉపశమనం లభించింది.
హోల్ సేల్ రూ.5.45
రిటైల్ ధర రూ.6 పైమాటే
ఊపిరి పీల్చుకున్న పౌలీ్ట్ర రైతులు
తణుకు/ఏలూరు టూటౌన్, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): కోడ్డు గుడ్డు ధరలు భారీగా పెరిగాయి. వరుస నష్టాలు చవిచూస్తున్న రైతులకు పెరిగిన ధరతో కాస్త ఉపశమనం లభించింది. కొన్ని రోజులుగా గుడ్డు ధర 5.05 పైసల నుంచి పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం ధర రూ.5.45 పైసలు ఉంది. రిటైల్ మార్కెట్‌లో 6 రూపాయలకు పైగానే విక్రయి స్తున్నారు. ఇప్పటి వరకు ఎండలు వల్ల తీవ్ర ఇబ్బందులు పడిన రైతుల కు ఇపుడు కోలుకునే పరిస్దితి వచ్చింది. వేసవిలో గుడ్లు దిగుబడి తగ్గడంతో పాటు, కోళ్లు చనిపోవడం వల్ల పౌలీ్ట్ర రైతులు తీవ్ర నష్టాలు పాలయ్యారు. దానికితోడు బర్డ్‌ఫ్లూ పౌలీ్ట్ర రైతులను కుదిపేసింది. ఆ నష్టాల నుంచి ఇప్పటికీ రైతులు కోలుకోలేదు. ప్రస్తుతం వర్షాలు పడడం తో వాతావరణం చల్లబడడం వల్ల కోళ్లు మేత తినడం ద్వారా ఉత్పత్తి కూడా పెరిగింది. దానికి తోడు గుడ్డు ధర పెరగడం రైతులకు కొంత లాభించింది. ధరలు కొద్దిరోజులు కొనసాగితే పౌలీ్ట్ర రైతులకు ఆర్థిక కష్టాలు కొద్దిమేర అయినా తొలిగే అవకాశం ఉంది. నెక్ ప్రస్తుతం ఉన్న ధరను కొంత కాలం పాటు కొనసాగించాలి. అలా కాకుండా ధర తగ్గించే ఆలోచన చేయకుండా ఉండాలని రైతులు కోరుతున్నారు.
పెరిగిన ఉత్పత్తి
వేసవి తర్వాత గుడ్ల ఉత్పత్తి బాగా పెరిగింది. జిల్లాలో కోటి 30లక్షల కోళ్లు ఉన్నాయి. వాటిలో కోటి గుడ్లు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయి. ఉత్పత్తి అయిన గుడ్లు స్థానికంగా 35 లక్షల వరకు వినియోగం అవు తున్నాయి. మిగిలిన 65 లక్షలు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. రైతులు ఇప్పటి వరకు నష్టాలను చవిచూసిన వారికి ఖర్చులు పోను రుణాలు తీర్చుకునే వెసులుబాటు కలిగింది.
పెరిగిన ఎగుమతులు
గుడ్లు ఉత్పత్తి అనుగుణంగా ఎగుమతులు కూడా బాగానే ఉన్నాయి. ఉభయ గోదావరి జిల్లాల నుంచి 30 లారీల వరకు ఎగుమతి అవుతాయి. ప్రధానంగా బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, మహారాష్ట్ర, తదితర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు.
ఆశాజనకంగా కోడి ధర
మాంసం కోసం వినియోగించే ఫారం కోడి ధర కూడా పెరిగింది. గతంలో ఎపుడు ఈ మాదిరి ధరలు లేవు. ప్రస్తుతం ఫారం కోడి కేజి రూ.97 ధరకు విక్రయిస్తున్నారు. ఈ ధర బ్రాయిలర్ కోడితో సమానంగా పెరుగుతుంది. ఇది కూడా రైతులకు కలసొచ్చే విధంగా ఉంది.
ధర నిలకడగా ఉంది
ప్రస్తుతం గుడ్డ ధర నిలకడగా ఉంది. ఈ ధరతో రైతులకు ఉపశమనం. ఏడాది నుంచి పౌలా్ట్ర పరిశ్రమ అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంది. వేసవి నుంచి ఇబ్బందులే. ఇపుడున్న ధర కొంత కాలం నిలకడగా ఉంటే రైతులకు మేలు జరుగుతుంది. ఇపుడున్న ధరతో కాస్త ఊరట లభిస్తుంది.
కొమాట్లపల్లి వెంకట సుబ్బారావు, పౌలీ్ట్ర ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు