Share News

రాసలీలల రాద్ధాంతం !

ABN , Publish Date - Apr 18 , 2025 | 12:16 AM

జిల్లా విద్యా శాఖ కార్యాలయంలో ఇద్దరు ఉద్యోగుల రాసలీలల వ్యవహారం ఉపాధ్యాయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఇదే అదనుగా సమగ్ర శిక్షలో మరొకరు సొంత కార్యాలయంలోని ఉద్యోగుల మధ్య ఇదే రకమైన చిచ్చు పెట్టేలా దుష్ప్రచారానికి ఒడిగట్టారు.

రాసలీలల రాద్ధాంతం !

విద్యా శాఖలో చర్చ.. సమగ్ర శిక్షలో కట్టు కథల దుష్ప్రచారం!

ఏలూరు అర్బన్‌, ఏప్రిల్‌ 17(ఆంధ్రజ్యోతి):జిల్లా విద్యా శాఖ కార్యాలయంలో ఇద్దరు ఉద్యోగుల రాసలీలల వ్యవహారం ఉపాధ్యాయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఇదే అదనుగా సమగ్ర శిక్షలో మరొకరు సొంత కార్యాలయంలోని ఉద్యోగుల మధ్య ఇదే రకమైన చిచ్చు పెట్టేలా దుష్ప్రచారానికి ఒడిగట్టారు. ఈ పరిణామాలను ఈ రెండు కార్యాలయాల అధికారులు నిశితంగా గమనిస్తు న్నారు. ఉపాధ్యాయ వర్గాల మధ్య జరుగుతున్న ప్రచారం. జిల్లా విద్యా శాఖ కార్యాలయ పరిధిలో ఇద్దరి మధ్య కొంతకాలంగా నెలకొన్న రాసలీలలు ఇటీవల పెద్ద మనుషుల దృష్టికి రాగా ఇరువురికీ చీవాట్లు పెట్టి, ఇకపై అలా జరగకుండా ఒప్పందం కుదిర్చినట్టు తెలిసింది. అయినప్పటికీ ఈ వ్యవహారా నికి ముగింపు పలకకుండా కొనసాగిస్తుండటంతో కొద్దిరోజుల క్రితం వారి వురూ ఏకాంతంగా ఉన్నపుడు అకస్మాత్తుగా ఇంటి గదిలోకి చొరబడిన కుటుం బ సభ్యులు ఒకరు వీడియోను తీసినట్టు సమాచారం. ఊహించని ఈ పరిణా మానికి ఉలిక్కిపడ్డ జంటపై కుటుంబ సభ్యులు దాడికి దిగటం, గాయాలతో ఆసుపత్రుల్లో చేరడంతో హాట్‌ టాపిక్‌గా మారింది.

సమగ్ర శిక్షలో కట్టుకథల దుష్ప్రచారం

విద్యాశాఖలో ఈ పరిణామాలు జరుగుతున్న నేపథ్యంలోనే సమగ్ర శిక్ష ప్రాజెక్టులో ఏళ్ల తరబడి పనిచేస్తున్న మరొకరు అక్కడి కార్యాలయంలో అలజడి సృష్టించేందుకు కొందరి మధ్య అవాంఛనీయ సంబంధాలు ఉన్నట్టు ప్రచారం ప్రారంభించినట్టు తెలుస్తోంది. తనను ప్రాజెక్టు నుంచి బయటకు పంపేయడానికి కారణమయ్యారన్న అక్కసుతోనే కృత్రిమ కథలు అల్లుతూ ప్రచారం చేయిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా ప్రాజెక్టు కార్యకలాపాల్లో ఒకింత అశాంతిని సృష్టించి వ్యక్తిగతంగా పైశాచిక ఆనందాన్ని పొందడానికి ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఈ రెండు పరిణామాల ముగింపు ఎలా ఉంటుందోనన్న ప్రచారం ప్రస్తుతం ఉపాధ్యాయ వర్గాల్లో జరుగుతోంది.

Updated Date - Apr 18 , 2025 | 12:16 AM