Share News

విద్యా రంగంలో జిల్లా ఆదర్శం కావాలి

ABN , Publish Date - Jun 10 , 2025 | 12:55 AM

విద్యరంగంలో వినూత్న మార్పులతో జిల్లాను ఆదర్శవంతంగా నిలపాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్‌ అన్నారు. వట్లూరు లోని సీఆర్‌రెడ్డి ఇంజనీరింగ్‌ కళాశాలలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ అధ్యక్షతన ఏర్పాటు చేసిన షైనింగ్‌ స్టార్‌ కార్యక్రమాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్‌ సోమవారం ప్రారంభించారు.

విద్యా రంగంలో జిల్లా ఆదర్శం కావాలి
షైనింగ్‌ స్టార్‌ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న మంత్రి నాదెండ్ల మనోహర్‌

మంత్రి నాదెండ్ల మనోహర్‌

పెదపాడు, జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి): విద్యరంగంలో వినూత్న మార్పులతో జిల్లాను ఆదర్శవంతంగా నిలపాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్‌ అన్నారు. వట్లూరు లోని సీఆర్‌రెడ్డి ఇంజనీరింగ్‌ కళాశాలలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ అధ్యక్షతన ఏర్పాటు చేసిన షైనింగ్‌ స్టార్‌ కార్యక్రమాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్‌ సోమవారం ప్రారంభించారు. పదో తరగతి, ఇంటర్మీడియ ట్‌లో ప్రతిభ కనబరిచిన 163 ఉన్నత పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు చెక్కులను అందజేసి సర్టిఫికెట్లతో సత్కరించారు. జిల్లాలో 2.78 లక్షల మంది విద్యార్థులుండగా 1.30 లక్షల మంది మాత్రమే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారని, ఈ సంఖ్య పెంచేందుకు కృషి చేయాలని మంత్రి నాదెండ్ల సూచిం చారు. జిల్లా పరిషత్‌ నుంచి విద్యారంగానికి ఎక్కువ నిధులు కేటాయించాలని, జిల్లాలో 10 వేలమంది ఉపాధ్యాయులున్నా రని, మెరుగైన విద్యనందించాలని కోరారు. కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ షైనింగ్‌ స్టార్‌ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు సన్మానం శుభపరిణామన్నారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ మాట్లాడుతూ దెందులూరు నియోజకవర్గంలో ఒక పాఠశాలను దత్తత తీసుకుని మూడు బస్సుల రవాణాతో అన్ని సౌకర్యాల కల్పనతో ఉత్తమ పాఠశాలగా తీర్చిదిద్దుతానన్నారు. జడ్పీ చైర్‌పర్సన్‌ ఘంటా పద్మశ్రీ మాట్లాడుతూ జిల్లాషరిత్‌ తరపున విజయకేతనం పుస్తకాన్ని విద్యార్థులకు అందజేశామని, పదో తరగతిలో మంచి ఫలితాలు సాధించగలిగామన్నారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, ఆప్కాబ్‌ చైర్మన్‌ గన్ని వీరాంజనేయులు, ఆర్టీసీ రీజియన్‌ చైర్మన్‌ రెడ్డి అప్పలనాయుడు, ఎస్పీ కిశోర్‌, జేసీ ధాత్రిరెడ్డి, ఏఎంసీ చైర్‌పర్సన్‌ గారపాటి రామసీత, మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 10 , 2025 | 12:55 AM