సుఖ సంతోషాల కోసమే జాతర
ABN , Publish Date - Nov 01 , 2025 | 12:46 AM
ఏలూరు నగర ప్రజల సుఖసంతోషాల కోసమే గంగానమ్మ జాతర నిర్వహిస్తున్నామని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. తూర్పు వీధిలోని గంగానమ్మ, మహాలక్ష్మమ్మ, పోతురాజు బాబు కొలుపులు, జాతర నిర్వహణకు శుక్రవారం ఎమ్మెల్యే చంటి సంప్రదాయ బద్ధంగా ముడుపుకట్టే కార్యక్రమాన్ని నిర్వహించి పందిరి రాట వేశారు.
తూర్పువీధి గంగానమ్మ ఆలయంలో ముడుపు కట్టిన ఎమ్మెల్యే చంటి
ఏలూరు కార్పొరేషన్, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి): ఏలూరు నగర ప్రజల సుఖసంతోషాల కోసమే గంగానమ్మ జాతర నిర్వహిస్తున్నామని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. తూర్పు వీధిలోని గంగానమ్మ, మహాలక్ష్మమ్మ, పోతురాజు బాబు కొలుపులు, జాతర నిర్వహణకు శుక్రవారం ఎమ్మెల్యే చంటి సంప్రదాయ బద్ధంగా ముడుపుకట్టే కార్యక్రమాన్ని నిర్వహించి పందిరి రాట వేశారు. మేళ తాళాలు, బాజా భజంత్రీలు, కోలాట నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, జాతర కన్వీనర్లు వంకినేని భానుప్రకాశ్, జిల్లెళ్ళమూడి నరసింహారావు, కలగర శివరామకృష్ణ, మాజీ కార్పొరేటర్ మారం హనుమంతరావు, తదితరులు పాల్గొన్నారు.
ఏలూరు సర్వజన సమ్మేళన దక్షిణపువీధి జాతర మహోత్సవానికి ఎమ్మెల్యే చంటి దంపతులు ముడుపు కట్టే కార్యక్రమంలో పాల్గొన్నారు. పడమరవీధిలోని పాత గంగానమ్మ అమ్మవారి ఆలయం వద్ద అమ్మవారికి స్నానం చేయించడం, పోణంగి రోడ్డులోని జరుగులమ్మ ఆలయం వద్ద ముడుపు కట్టడం, మార్కం డేయ స్వామి ఆలయం వద్ద రాట వేశారు. కార్యక్రమాల్లో నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు, ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, ఏఎంసీ చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారథి, యుడా చైర్మన్ పెద్దిబోయిన వాణీశివప్రసాద్, కంప్యూటర్ ప్రసాద్, దక్షిణపువీధి కమిటీ గౌరవ అధ్యక్షుడు నూకల రామకృష్ణ, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.