గంజాయి నిర్మూలనకు ఆపరేషన్ విజయ్
ABN , Publish Date - Jul 04 , 2025 | 12:45 AM
వలస కూలీల ఆర్థిక పరిస్థితిని ఆసరా చేసుకుని కొంతమంది అక్రమా ర్కులు రైళ్లలో గంజాయి రవాణా చేస్తున్నారు.
రైళ్లలో కూలీలతో రవాణా
ఈగల్ టీమ్ నిఘా
ఏలూరు రైల్వే స్టేషన్‌లో తనిఖీ
ఏలూరు క్రైం, జూలై 3 (ఆంధ్రజ్యోతి): వలస కూలీల ఆర్థిక పరిస్థితిని ఆసరా చేసుకుని కొంతమంది అక్రమా ర్కులు రైళ్లలో గంజాయి రవాణా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గంజాయి నిర్మూలించడానికి ఆపరేషన్ విజయ్ ప్రారంభించామని ఈగల్ టీమ్ ఐజీ కె.రవికృష్ణ తెలిపారు. ఏలూరు పెద్ద రైల్వే స్టేషన్‌లో గురువారం ఉదయం పోలీసులు, జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్ పోలీసు జాగిలాలతో కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలు భోగీలను ఏలూరు నుంచి విజయవాడకు వెళ్ళే సమయంలో క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఏలూరు పెద రైల్వే స్టేషన్‌లో ఐజీ రవికృష్ణ మీడియాతో మాట్లాడుతూ ఒడిశా రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా గంజాయి అక్రమ రవాణా జరుగుతుందన్నారు. వారానికి రెండుసార్లు తనిఖీలు జరుగుతాయని స్పష్టం చేశారు.
అల్లూరి సీతారామరాజు జిల్లాలో డ్రోన్, శాటిలైట్ సర్వేల ద్వారా గంజాయి ప్రాంతాన్ని గుర్తించి గంజాయి పంటను పూర్తిగా నిర్మూలించామ న్నారు. ఆ జిల్లాలో డ్రోన్ కనబడితే పోలీసులు ఉన్నట్లేనన్న భావన ప్రజల్లో ఏర్పడిందన్నారు. గంజాయి ఎవరైనా తాగినా ఎవరి వద్ద అయి నా చూసినా వెంటనే 1972కు సమాచారం అందించాలని సూచిం చారు. ఎస్పీ కేపీఎస్ కిశోర్ మాట్లా డుతూ ఆపరేషన్ విజయ్‌లో భాగం గా ఏలూరు రైల్వే స్టేషన్లలో రైళ్ల తనిఖీలను నిర్వహిస్తున్నామని చె ప్పారు. ఏలూరు జిల్లాను గంజాయి రహిత జిల్లా తీర్చిదిద్దేందుకు అనేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించామన్నారు. జిల్లాలో 20 కేసుల్లో 700 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని 45 మంది అరెస్టు చేసి 11 మోటారు సైకిళ్ళు స్వాధీనం చేసుకున్నామన్నారు.
జిల్లా వ్యాప్తంగా డ్రగ్స్ బ్రో అనే కార్యక్రమాన్ని జిల్లా అధికారులతో కలిసి నిర్వహిస్తున్నామని చెప్పారు. పిల్లలు మత్తుపదార్ధాలకు అలవాటుపడితే పోలీసులకు సమాచారం అందించాలని, వారిపై ఎలాంటి కేసులు పెట్టబోమన్నారు. వారికి గం జాయి, మత్తు పదార్థాలు ఎవరు సరఫరా చేస్తున్నారో ఆరా తీసి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. పిల్లలను కౌన్సెలింగ్ సెంటర్లకు పంపిస్తామని ఎస్పీ తెలిపారు. తనిఖీల్లో ఈగల్‌టీమ్ ఎస్పీ నగేష్‌బాబు, ఏఎస్పీ ఎన్.సూర్యచంద్రరావు, డీఎస్పీ డి.శ్రావణ్‌కుమార్, రైల్వే డీఎస్పీ రత్నరాజు, రైల్వే పోలీసులు, జిఆర్‌పి పోలీసులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.