సంస్కరణలు సరే.. ప్రక్షాళన ఏదీ..?
ABN , Publish Date - Nov 23 , 2025 | 11:35 PM
జిల్లాలోని కైకలూరులో రూ.8 కోట్ల మేర అక్రమాలు వెలుగు చూశాయి.
నేడు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జిల్లా పర్యటన
పంచాయతీల్లో అక్రమాలకు కళ్లెం వేస్తారా?
ఐఎస్ జగన్నాథపురంలో మైనింగ్‌పై చర్యలు శూన్యం!
పంచాయతీరాజ్‌లో సంస్కరణలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పెద్దపీట వేశారు. పంచాయతీలను స్వర్ణ పంచాయతీలుగా తీర్చిదిద్ది పరిపాలనలో పారదర్శకత కోసం కస్టర్లను ఏర్పాటు చేశారు. ఆన్‌లైన్ పన్నుల వసూళ్ల ప్రక్రియ వేగంగా సాగుతోంది. సంస్కరణ ఫలితాల కంటే అక్రమాలు, జిల్లాలో ఇటీవల అవినీతి భాగోతాలే పెద్ద ఎత్తున బయటపడ్డాయి. మేజర్ పంచాయతీలే కాకుండా, మైనర్ పంచాయతీల్లో సైతం సర్పంచ్‌లు, కార్యదర్శులు కుమ్మక్కై కోట్లలో స్వాహా చేయడం షరా మామూలు అయింది. సంస్కరణలతో పాటే అవినీతి ప్రక్షాళనపై దృష్టి సారించాలి.
(ఏలూరు–ఆంధ్రజ్యోతి)
జిల్లాలోని కైకలూరులో రూ.8 కోట్ల మేర అక్రమాలు వెలుగు చూశాయి. ద్వారకాతిరుమల గ్రామపంచాయతీలో 2024లో రూ.2.25కోట్ల లక్షలు అవినీతి జరిగింది. ముదినేపల్లి మండలంలో మైనర్ పంచాయతీ అయిన పెయ్యేరులో ఇటీవల రూ.37 లక్షలు కుంభకోణం, నూజివీడు మండలంలోని ముకాసనరసన్నపాలెం రూ.18లక్షలు నిధులు దుర్వినియోగం బయటపడ్డాయి. తాజాగా భీమడోలు పంచాయతీలో రూ.2కోట్ల పైబడి అక్రమాలు జరిగాయని ఈవోకు తాజాగా డీపీవో షోకాజ్ నోటీసు జారీ చేశారు. కొద్ది నెలల క్రితం ముసునూరు మండలం చింతలవల్లి రూ.32 లక్షలు, వేల్పుచర్లలో రూ.40లక్షలు నిధులు దుర్వినియోగం జరి గింది. 18 నెలలు కాలంలోనే అడ్డగోలు అక్రమాలకు సర్పం చ్‌లు, కొందరు ఈవోలు పంచాయతీ నిధులకు పాల్పడ్డారు. అవినీతి సొమ్ము కక్కించే చర్యలు శూన్యమే. ప్రతీ సంవత్స రంలో పంచాయతీ ఆడిట్‌ల్లో అక్రమాలు బయటపడుతు న్నాయి. రిపోర్టుల్లో తేల్చుతున్నా సరిదిద్దుకోవడం లేదు.
విచారణ తూతూమంత్రం..
పంచాయతీల్లో వెలుగుచూసిన అక్రమాలను నిగ్గు తేల్చేందుకు పారదర్శక విచారణ జరగడం లేదు. డీఎల్‌పీవో చేయాల్సిన విచారణ జిల్లాస్థాయి అధికారులు చేస్తున్నా విశ్వసనీయతకు అర్థం ఉండడం లేదు. విచారణల పేరిటే విచారణ అధికారుల వేల సొమ్ము నుంచి లక్షల్లో అక్రమాలు చేయడం పరిపాటిగా మారిందనే ఆరోపణలు వస్తున్నాయి. మరికొద్ది నెలల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యం లో అవినీతి సొమ్ములు కక్కించే పటిష్ట యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.
అందుబాటులో ఉండేదెవరు?
గ్రామ పరిపాలనలో కీలకంగా వ్యవహరించాల్సి పంచా యతీ కార్యదర్శులు పనిచేసే చోటే నివాసం ఉండడం లేదు. ఈవోఆర్డీలు అయితే చెప్పనవసరం లేదు. జిల్లా పంచా యతీశాఖ పరిధిలో ఇద్దరు డీఎల్‌పీవోలు చెలరేగిపో తున్నారు. వీరంతా పనిచేసే చోట్ల నివాసం ఉండడం లేదు. మరోవైపు అడ్డుగోలు అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.
మైనింగ్ వ్యవహారం నీరుగారింది
ఐఎస్ జగన్నాథపురంలో దీపం పథకం –2 ప్రారంభిం చడానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గతేడాది నవంబరు 1న పర్యటించారు. వైసీపీ హయాంలో అప్పట్లో ఇక్కడ సర్వే నెంబర్ 425లో 8.48 ఎకరాల స్థలంలో మట్టి తవ్వకా ల్లో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కొంతమంది ఫిర్యాదు చేశారు. అప్పట్లో దీనిపై నివేదిక అందజేయాలని కలెక్టర్ వెట్రిసెల్విని డిప్యూటీ సీఎం ఆదేశించారు. దీనిపై ఇప్పటికీ తగిన చర్యలు చేపట్టలేదు. రెండోసారి పర్యటనకు వస్తున్న పవన్ కల్యాణ్ పంచాయ తీల్లో అక్రమాలు, మైనింగ్ వ్యవహారంపై ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది.
పవన్‌కల్యాణ్ పర్యటనకు భారీ బందోబస్తు
ఏలూరు క్రైం/ద్వారకాతిరుమల, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ద్వారకాతిరుమల మండలం జగన్నాధపురంలో సోమవారం పర్యటించనున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేశారు. ఐఎస్ జగన్నాధ పురంలో సుందరగిరిపై లక్ష్మీనారసింహుని దర్శనం, పలు అభివృద్ధి పనులకు పవన్ కల్యాణ్ సోమవారం శంకుస్థాపన చేయనున్నారు. కలెక్టర్ కె.వెట్రిసెల్వి, ఎస్పీ కేపీఎస్.కిశోర్, జేసీ ఎంజె అభిషేక్ గౌడ ఆదివారం ఉప ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. ఎస్పీ కిశోర్ క్షేత్రస్థాయి సిబ్బందికి సూచనలు ఇచ్చారు. ఇటీవల జిల్లాలో 15 మంది మావోయిస్టులు పోలీసులకు పట్టుబడిన నేపథ్యంలో అత్యం త భద్రత చర్యలను చేపట్టారు. కొద్ది రోజుల నుంచి ఎస్పీ కిశోర్ స్వయంగా ఆ ప్రాంతాలను పరిశీలించి పోలీసు అధికారులు, సిబ్బందికి తగిన ఆదేశాలు జారీ చేశారు. 300 మంది పోలీసు సిబ్బం దిని బందోబస్తులో నియమించారు. పవన్ కల్యాణ్ పర్యటించే మార్గాలు, సభా స్థలాలు, వాహనాల పార్కింగ్, తీసుకోవా ల్సిన జాగ్రత్తలను అధికారులకు సూచిం చారు. ప్రజలకు, వాహనదారులకు అసౌక ర్యం కలుగకుండా ట్రాఫిక్ మళ్లింపు, నియంత్రణ చర్యలు చేపట్టాలని ఆదేశిం చారు. జిల్లా సివిల్, ఆర్ముడ్ రిజర్వు, ట్రాఫిక్ విభాగాలు, డ్రోన్ కెమెరాల సిబ్బం ది బందోబస్తు విధులను పటిష్టంగా నిర్వహించాలన్నారు. ఏఎస్పీ ఎన్.సూర్యచంద్రరావు, డీఎస్పీలు శ్రావణ్‌కుమార్, ఎం.వెంకటేశ్వరరావు, భీమడోలు సీఐ యుజె విల్సన్, జంగారెడ్డిగూడెం ఆర్డీవో ఎంవీ.రమణ పాల్గొన్నారు.