Share News

మార్మోగిన గోవింద నామస్మరణ

ABN , Publish Date - Jul 13 , 2025 | 12:22 AM

గోవిందనామాలతో శ్రీవారి క్షేత్ర ఆలయ ప్రాంగణం శనివారం మార్మోగింది. స్వామికి ప్రీతికరమైన రోజుకావడంతో ఆలయానికి ఉదయం నుంచి భక్తులు రాకతో భక్తుల రద్దీ పెరిగింది.

మార్మోగిన గోవింద నామస్మరణ
వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో వేచి ఉన్న భక్తులకు మంచినీరు అందిస్తున్న సేవా సిబ్బంది

ద్వారకాతిరుమల క్షేత్రంలో భక్తుల రద్దీ

ద్వారకాతిరుమల, జూలై 12 (ఆంధ్రజ్యోతి): గోవిందనామాలతో శ్రీవారి క్షేత్ర ఆలయ ప్రాంగణం శనివారం మార్మోగింది. స్వామికి ప్రీతికరమైన రోజుకావడంతో ఆలయానికి ఉదయం నుంచి భక్తులు రాకతో భక్తుల రద్దీ పెరిగింది. ఆషాఢ మాసం శూన్యమాసమైనా దాదాపు 20 వేల మంది భక్తు లు వచ్చారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎండవేడి అధికంగా ఉండడంతో క్యూలైన్ల వద్ద, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ వద్ద భక్తులు ఎక్కువగా తిరిగే ప్రాంతాల్లో ఆలయ సిబ్బంది, సేవాసంఘాల సిబ్బంది మంచినీరు అందజేశారు. చల్లని నీడ కోసం భక్తులు చెట్ల నీడకు పరుగులు తీశారు. భక్తులు మొక్కుబడులు తీర్చుకుని స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. అనంతరం తీర్థ, అన్నప్రసాదాలను స్వీకరించారు.

Updated Date - Jul 13 , 2025 | 12:22 AM