శాస్త్రోక్తంగా శ్రీచక్రవార్యుత్సవం
ABN , Publish Date - Oct 09 , 2025 | 12:28 AM
శ్రీచక్ర వార్యుత్సవం బుధవారం ఉదయం శాస్త్రోక్తంగా జరిగింది.
శేషాచలంపై బ్రహ్మోత్సవ సందడి
ద్వారకాతిరుమల, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): శ్రీచక్ర వార్యుత్సవం బుధవారం ఉదయం శాస్త్రోక్తంగా జరిగింది. స్వామివారి ఆశ్వయుజ మాస దివ్య బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో చక్రవార్యుత్సవం, మౌన బలి, సాయంత్రం ధ్వజావరోహణ జరిగాయి. శ్రీవారి ఉత్సవ వైభవాన్ని వీక్షించేందుకు వచ్చిన సర్వా ది దేవతలకు ఉద్వాసన పలికే క్రమంలో ధ్వజ స్తంభంపై ఎగురవేసిన గరుడ పటాన్ని శాస్త్రోక్తంగా కిందికి దింపడమే ధ్వజావరోహణ.
శ్రీచక్రవార్యుత్సవం ఇలా..
ఆలయ ఆవరణలో శ్రీవారు, అమ్మవార్లు, చక్రపెరు మాళ్లును ఒక వేదికపై ఉంచారు. ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్యహవాచన జరిపారు. పూజాధికాల అనం తరం సుగంఽధ ద్రవ్యాలు, పంచ పల్లవులు, శ్రీచందనం, పసుపు, మంత్రపూత జలంతో శ్రీచక్రస్వామిని అభిషే కించారు. అనంతరం పంచామృతాభిషేకాన్ని జరిపి హారతులు ఇచ్చారు. అర్చకులు అభిషేక జలాన్ని భక్తు ల శిరస్సులపై జల్లారు. పూర్ణాహుతి హోమాన్ని శాస్త్ర బద్ధంగా నిర్వహించిన అనంతరం సర్వాదిదేవతలకు ఉద్వాసనగా ధ్వజావరోహణ భక్తులకు నేత్రపర్వమైంది.
శ్రీవారి గ్రామోత్సవం
చినవెంకన్న ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు, ఉభయదేవేరులతో ప్రతీ నిత్యం వివిధ వాహనాలపై భక్తులను కటాక్షిస్తున్నారు. బుధవారం ఉదయం తొళక్క వాహనం, రాత్రి అశ్వవాహనంపై క్షేత్రపురవీథుల్లో ఊరేగారు.