Share News

ఆ రోడ్డుపై జాగ్రత్త సామీ..

ABN , Publish Date - Oct 09 , 2025 | 12:24 AM

శ్రీవారి క్షేత్రానికి వచ్చే రహదారి తూట్లు పడినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండడంతో కొందరు వినూత్నంగా రహదారిపై సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు.

ఆ రోడ్డుపై జాగ్రత్త సామీ..
ద్వారకాతిరుమల విర్డ్‌ ఆసుపత్రి ఎదురుగా రోడ్డుపై సూచిక బోర్డు

రోడ్డుపై గుంతల్లో సూచిక బోర్డులు

ద్వారకాతిరుమల, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): శ్రీవారి క్షేత్రానికి వచ్చే రహదారి తూట్లు పడినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండడంతో కొందరు వినూత్నంగా రహదారిపై సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. పెద్ద పెద్ద గుంతల్లో పలువురు వాహనదారులు ప్రమాదాల బారిన పడుతుండడంతో బోర్డులు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. దాదాపు ఏడు ప్రాంతాల్లో ఎర్రజెండాలతో సూచిక బోర్డులను ఉంచారు. ద్వారకాతిరు మల, గొల్లగూడెం, పంగిడిగూడెం, తదిరత చోట్ల రోడ్డు చిధ్రమైంది. ద్వారకాతిరుమల విర్డ్‌ ఆసుపత్రి వద్ద సూచిక బోర్డు ‘గుంత’ చెబుతు న్నట్లు విన్నూత్నంగా ఉండి అధికారులను ఆలోచింపచేస్తోంది.

నన్ను బాగు చేయండి..

గుంత మాట్లాడితే ఎలా ఉంటుందో మీరే చూడండి.. ఇది అజ్ఞాత వ్యక్తులు ఏర్పాటు చేసిన సూచిక బోర్డు సారాంశం.

‘ఈ మార్గంలో వెళ్లే వారికి నేను గాయాలు చేస్తున్నాను. నేను ప్రభుత్వాన్ని ప్రాధేయపడుతున్నాను. వాహనదారులకు మరో పెద్దగాయం చేసేలోగా దయచేసి నన్ను బాగుచేయండి.’ రోడ్‌ సేఫ్టీ పేరుతో ఎర్ర జెండాలతో ఇలా బోర్డు ఏర్పాటు చేయడం, గుంతల వద్ద ఇది హెచ్చరి కలా పనిచేస్తోంది. ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి ఈ రోడ్డు మరమ్మతు పనులు చేపట్టాల్సి ఉంది.

Updated Date - Oct 09 , 2025 | 12:24 AM