Share News

చిన వెంకన్న కొండపై బ్రహ్మోత్సవ శోభ

ABN , Publish Date - Oct 01 , 2025 | 12:37 AM

ద్వారకా తిరుమల శేషాచలంపై కొలువుదీరిన చినవెంకన్న ఆశ్వయుజ మాస దివ్య బ్రహ్మోత్సవాలు గురువారం నుంచి ప్రారంభమై 9 వరకు వైఖానస ఆగమయుక్తంగా జరగనున్నాయి.

చిన వెంకన్న కొండపై బ్రహ్మోత్సవ శోభ

రేపటి నుంచి తిరు కల్యాణోత్సవాలు

6వ తేదీ రాత్రి శ్రీవారి కల్యాణం.. 7న రఽథోత్సవం

ద్వారకాతిరుమల, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): ద్వారకా తిరుమల శేషాచలంపై కొలువుదీరిన చినవెంకన్న ఆశ్వయుజ మాస దివ్య బ్రహ్మోత్సవాలు గురువారం నుంచి ప్రారంభమై 9 వరకు వైఖానస ఆగమయుక్తంగా జరగనున్నాయి. గురువారం ఉదయం స్వామి, అమ్మవార్లను పెండ్లికుమారుడు, పెండ్లికు మార్తెలుగా చేస్తారు. 3న ధ్వజారోహణ, 5 రాత్రి 7 గంటలకు ఎదుర్కోలు ఉత్సవం, 6 రాత్రి 8 గంటలకు శ్రీవారి కల్యాణోత్సవం నిర్వహిస్తారు. 7న రాత్రి 8 గంటలకు రఽథోత్సవం, 8న శ్రీచక్ర వార్యుత్సవం, ధ్వజావరోహణ జరుగుంతుంది. 9న ఉదయం 9గంట లకు చూర్ణోత్సవం, వసంతోత్సవం, రాత్రి జరిగే ద్వాదశకోవెల ప్రదక్షిణలు, శ్రీపుష్పయాగోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయని ఈవో ఎన్వీ సత్యన్నారాయణమూర్తి తెలిపారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఈనెల 2 నుంచి 9వ తేదీ వరకు నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్టు తెలిపారు.

వాహన సేవలిలా..

బ్రహ్మోత్సవ సమయంలో స్వామి, అమ్మవార్లకు నిత్యం జరిగే వాహన సేవల నిమిత్తం వివిధ రకాల వాహనాలను సిబ్బంది శుభ్రం చేస్తున్నారు. రోజుకో వాహనంలో అమ్మ వార్లతో కలసి శ్రీవారు వివిధ అలంకారాల్లో ఊరేగుతూ పురవీఽధుల్లో భక్తులను కటాక్షించనున్నారు. 2వ తేదీ రాత్రి 7గంటలకు గజవాహనంపై శ్రీవారి తిరువీధిసేవ, 3వ తేదీ రాత్రి 9 గంటలకు హంస వాహనంపై, 4వ తేదీ ఉదయం 7 గంటలకు సూర్యప్రభ, రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనాలపై గ్రామోత్సవం, 5వ తేదీ ఉదయం 7 గంటలకు హనుమ ద్వాహనంపై, 6న రాత్రి 8 గంటలకు శ్రీవారి కల్యాణం, వెండి గరుడ వాహనాలపై, 7వ తేదీ రాత్రి 8 గంటలకు రథవాహనంపై శ్రీ వారి తిరు వీధిసేవ, 8వ తేదీ రాత్రి 9 గంటల అనంతరం అశ్వవాహన సేవ ఉంటాయి.

Updated Date - Oct 01 , 2025 | 12:37 AM