నకిలీ ఇంజన్ ఆయిల్ తయారీ
ABN , Publish Date - Dec 30 , 2025 | 11:53 PM
ముదినేపల్లి కేంద్రంగా నిర్వహి స్తున్న నకిలీ ఇంజన్ ఆయిల్ తయారీ ముఠా గుట్టు రట్టయ్యింది.
ముదినేపల్లి కేంద్రంగా ముఠా కార్యకలాపాలు
ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు
ముదినేపల్లి, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): ముదినేపల్లి కేంద్రంగా నిర్వహి స్తున్న నకిలీ ఇంజన్ ఆయిల్ తయారీ ముఠా గుట్టు రట్టయ్యింది. ఎస్‌ఐ వీరభద్రరావు తెలిపిన వివరాలు ప్రకారం.. ముదినేపల్లికి చెందిన కె వెంకట సురేష్, పి.నరేంద్ర నకిలీ ఇంజన్ ఆయిల్ తయారీకి పాల్పడుతూ కొంత కాలంగా వాహనాల యజమానులను మోసం చేస్తున్నారు. సమాచారం అందడంతో మంగళవారం సురేష్ ఇంటిని తనిఖీ చేశారు. నరేంద్రతో కలిసి నకిలీ ఇంజన్ ఆయిల్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఇందుకు వినియో గిస్తున్న రసాయనాలు, నకిలీ కాప్ సీలింగ్ మెషీన్, తూకం యంత్రం, వివిధ బ్రాండెడ్ ఆయిల్ లేబుళ్లు, ఖాళీ టిన్నులు గుర్తించారు. జేసీబి హైడ్రాలిక్, బజాజ్ సర్వో ఆయిల్స్ తదితర కంపెనీల పేర్లతో నకిలీ యాడ్‌బ్లూను తయారు చేసి మోటార్ మోకానిక్‌లకు సరఫరా చేస్తూ మోసం చేస్తున్నట్లు బయటపడిందని ఎస్‌ఐ వివరించారు. దీనివల్ల పర్యావరణానికి కూడా హాని కలిగిస్తున్నారని చెప్పారు. వీరిరువురికి ఇతర ప్రాంతాలకు చెందిన వారి సహకారం కూడా ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.