Share News

డీఎస్సీ–2025 ఎంపికైన అభ్యర్థుల జాబితా సిద్ధం

ABN , Publish Date - Sep 15 , 2025 | 12:05 AM

మెగా డీఎస్సీ–2025 ఉపాధ్యాయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాలు సోమవారం విడుదల చేయడానికి విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది.

డీఎస్సీ–2025 ఎంపికైన అభ్యర్థుల జాబితా సిద్ధం

నేడు విడుదల చేయనున్న అధికారులు

ఏలూరు అర్బన్‌, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): మెగా డీఎస్సీ–2025 ఉపాధ్యాయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాలు సోమవారం విడుదల చేయడానికి విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. జాబితాలను ప్రభుత్వ, జడ్పీ, ఎంపీపీ, మున్సిపల్‌, ట్రైబల్‌ వెల్ఫేర్‌, జువనైల్‌ వెల్ఫేర్‌ యాజమాన్యాల వారీగా, పోస్టుల వారీగా రూపొందించారు. వీటిపై డీఎస్సీ కమిటీ చైర్మన్‌ అయిన కలెక్టర్‌ ఆమోదం తీసుకున్నట్టు కన్వీనర్‌, ఉమ్మడి జిల్లా డీఈవో ఎం.వెంకట లక్ష్మమ్మ ఆదివారం వెల్లడించారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 1074 పోస్టులను భర్తీచేయనున్న విషయం విదితమే. అభ్యర్థుల తుది ఎంపికజాబితాలను ఏలూరులోని కలెక్టర్‌, డీఈవో కార్యాలయాల్లో ప్రద ర్శించడంతోపాటు, అధికారిక వెబ్‌సైట్‌ apdsc.apcfss.inలో అందుబాటులో ఉంచుతారు. రెండుదఫాలుగా మెడికల్‌ బోర్డు నిర్వహించిన వైకల్య శాతం అసెస్‌మెంట్‌ టెస్టులో వ్యత్యాసాల కారణంగా మెరిట్‌లో తనకు అన్ని అర్హతలున్నప్పటికీ సెలక్షన్‌ జోన్‌ పరిశీలన నుంచి తొలగించడాన్ని సవాల్‌ చేస్తూ జిల్లాకుచెందిన దివ్యాంగుల(పీహెచ్‌) కోటా అభ్యర్థిని ఒకరు న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్టు తెలిసింది. దీంతోపాటు రాష్ట్రస్థాయిలో రాయలసీమకు చెందిన కొందరు అభ్యర్థులు పోస్టుల (స్కూల్‌ అసిస్టెంట్‌/ఎస్జీటీ) కేటాయింపు విఈ్ఛనాన్ని వ్యతిరేకిస్తూ న్యాయస్థానం తలుపు తట్టినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఉద్యోగాలకు ఎంపికైన తుది జాబితాలు సోమవారం విడుదల కానుండడం గమనార్హం. దీనిపై విద్యాశాఖ ఎలా స్పందించిందీ తెలియరాలేదు.

మరోవైపు డీఎస్సీ ఉద్యో గాలకు ఎంపికైన అభ్యర్థుల తుదిజాబితాలు సోమవారం విడుదల చేస్తుండడంతో, ఉమ్మడి జిల్లాలో మండలాలవారీగా ఉద్యోగాలు పొందిన వారిని గుర్తించి, వారిని 18న ఏలూరుకు తీసుకు రావడం, ఎంపికచేసిన పాఠశాలల్లో భోజన, వసతి ఏర్పాట్లు కల్పించడం, 19న ఉదయం వెలగపూడిలో జరిగే నియామకపత్రాల అందజేత కార్యక్రమానికి తీసుకెళ్లే పనులను పర్యవేక్షించడానికి డీవైఈవోలు, ఎంఈ వోలకు ఇన్‌చార్జి బాఈ్యతలను డీఈవో వెంకటలక్ష్మమ్మ ఆదివారం అప్పగిం చారు. వీరందరితో సోమవారం సమావేశం ఏర్పాటుచేసి, పాఠశాలలవారీగా బాధ్యతలను కేటాయించనున్నారు.

Updated Date - Sep 15 , 2025 | 12:05 AM