అమృతజలం
ABN , Publish Date - Jul 16 , 2025 | 12:31 AM
జిల్లాలో తణుకు, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఆకివీడు పట్టణాలకు పైప్‌లైన్ ద్వారా విజ్జేశ్వరం నుంచి నీటిని మళ్లించనున్నారు.
పట్టణాలకు నేరుగా గోదావరి నీరు
పైప్‌లైన్ ప్రాజెక్ట్‌కు టెండర్లు..
అంతర్గత పనులకు నిధులు
24 గంటలూ నీటి సరఫరా
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
పట్టణ ప్రజలకు మంచినీరు ఇవ్వాలంటే గగ నమైపోతోంది. వేసవిలో రెండు పూటలా సమృ ద్ధిగా నీరు ఇవ్వలేని దుస్థితి జిల్లాలో నెల కొంది. అఖండ గోదావరి ఉన్నా వేసవి రెండు నెలలు మంచినీటికి కటకటలాడిపోతున్నారు. మరోవైపు కాలువలు కాలుష్యంగా మారడంతో మున్సిపా లిటీ నీటిని తాగునీటి అవసరాలకు ఉపయోగిం చడం లేదు. పర్యవసానంగా ప్రైవేటు వాటర్ ప్లాంట్‌లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. జిల్లా ప్రజలు కేవలం తాగునీటి కోసం ఏటా కోట్ల రూపాయలు తగులబెడుతున్నారు. గోదావ రి జిల్లాల్లో ఇటువంటి దుర్భర స్థితిని గమనిం చిన ప్రభుత్వం పట్టణ ప్రజలకు పుష్కలంగా మంచి నీరందించే ప్రణాళిక చేపట్టింది. జిల్లాలో తణుకు, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఆకివీడు పట్టణాలకు పైప్‌లైన్ ద్వారా విజ్జేశ్వరం నుంచి నీటిని మళ్లించనున్నారు. అక్కడ చెరువులకు నీటిని మళ్లించి శుద్ధి చేస్తారు. పట్టణాల్లో అంతర్గతంగా పైప్‌లైన్‌లను వేస్తారు. పట్టణంలోని అన్ని ప్రాంతాలకు మంచినీరు అందించాలన్న ధ్యేయంతో ప్రభుత్వం అమృత్ 2.0లో భారీగా నిధులు కేటాయించింది. కేంద్రం తో సంప్రందించి అత్యధిక నిధులు రాబట్టింది.
పట్టణాల్లో ఓవర్‌హెడ్ ట్యాంక్‌లను నిర్మించ డానికి అమృత్ 2.0లో నిధులు మంజూరు చేసింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది వ్యవధిలోనే పట్టణాల్లో మంచినీటి సరఫరాకు చర్యలు తీసుకుంది. సమగ్ర ప్రాజెక్ట్‌ను సమర్పిం చాలని జిల్లా ప్రజారోగ్యశాఖకు ఆదేశాలు జారీ చేసింది. మూడు నెలల క్రితమే నిధులు మం జూరయ్యాయి. జిల్లా అధికారులు రాత్రి, పగలు అనే తేడా లేకుండా పనిచేశారు. నివేదికను సిద్ధం చేశారు. ప్రభుత్వానికి పంపారు. ప్రాజెక్ట్ నివేదికపై ప్రభుత్వం సంతృప్తి వ్యక్తం చేసింది. పరిపాలన అనుమతులు మంజూరుచేసింది. మరోవైపు టెండర్లు పిలిచేశారు. ఈ నెల 21న టెండర్లు తెరవనున్నారు. కాంట్రాక్టర్లు స్పందిస్తే పనులకు ఆస్కారం ఉంటుంది. గోదావరి నుంచి నేరుగా పట్టణాల్లోని పంపుల చెరువలకు మంచినీరు వచ్చి చేరుతుంది. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
ఓవర్ హెడ్ రిజర్వాయర్ల నిర్మాణం
24 గంటల నీటి సరఫరాకు అమృత్ పథకంలోనే నిధులు కేటాయించారు. పట్టణాల్లో అవసరమైన ఓవర్ హెడ్ రిజర్వాయర్‌లను నిర్మిస్తున్నారు. తణుకు పట్టణంలో నాలుగు, ఆకివీడు, నర్సాపురం, తాడేపల్లిగూడెంలో ఒక్కో ఓవర్ హెడ్ రిజర్వాయర్‌ను నిర్మించేలా ప్రణాళిక చేశారు. టెండర్‌లు పిలిచారు. తాడేపల్లిగూడెంలో రెండో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణం జరుగుతుండడంతో విజ్జేశ్వరం నుంచి పైప్‌లైన్ ప్రాజెక్ట్ వేయడం లేదు. ఏలూరు కాలువ నుంచి రెండో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌కు, అక్కడ నుంచి పంపుల చెరువు వద్దకు పైప్‌లైన్ వైసే పనులు చేపట్టారు. తాడేపల్లిగూడెంలో అంతర్గతంగా పైప్‌లైన్‌లు, ఇతర అవసరాలకు నిధులు కేటాయించారు.