Share News

శునకంపై మమకారంతో పచ్చబొట్టు

ABN , Publish Date - Dec 01 , 2025 | 12:12 AM

పచ్చ బొట్టు చెరిగిపోదులే నా రాజా... అని ఓ సినిమాలో హీరో హీరోయిన్‌ తమ ప్రేమ గురించి చెప్పుకుంటే తణుకు మండలం పైడిపర్రుకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ తాను పెంచుకున్న కుక్క బొమ్మనే కాలిపై పచ్చబొట్టు వేయిం చుకున్నాడు.

శునకంపై మమకారంతో పచ్చబొట్టు
కాలిపై పెంచిన కుక్క పచ్చ బొట్టు వేయించుకున్న బాలాజీ

తణుకు రూరల్‌, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): పచ్చ బొట్టు చెరిగిపోదులే నా రాజా... అని ఓ సినిమాలో హీరో హీరోయిన్‌ తమ ప్రేమ గురించి చెప్పుకుంటే తణుకు మండలం పైడిపర్రుకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ తాను పెంచుకున్న కుక్క బొమ్మనే కాలిపై పచ్చబొట్టు వేయిం చుకున్నాడు. ప్రేమతో పెంచిన కుక్క చనిపోవడంతో కాలిపై పచ్చబొట్టుగా జ్ఞాపకంగా ఉంచుకు న్నారు. పైడిపర్రుకు చెందిన చాగంటి బాలాజీ హైదరాబాద్‌ కేంద్రంగా అమెజాన్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా ఇంటి నుంచే పనిచేస్తున్నాడు. ఇంటిలో ఒక కుక్కను మచ్చిక చేసుకుని పెంచుతున్నారు. అది మూడు ఈతలుగా సుమారు 30 కుక్క పిల్లలను పెట్టింది. వాటిలో ఒక కుక్క పిల్ల పేరు బుడ్డీ. 2012 జనవరి ఒకటిన పుట్టింది. బుడ్జీ తమ కుటుంబంలో ఒక సభ్యుడిగా మారిపోయిందన్నాడు. 2020 అక్టోబరు 4న చనిపోవడంతో మర్చిపోలేని బాలాజీ బుడ్డీ ఫొటోనే కాలి తొడ కింది భాగంలో వెనుక వైపున పచ్చబొట్టుగా వేయించున్నాడు. బుడ్డీ జ్ఞాపకార్థం గ్రామంలోని కుక్కలకు రోజూ ఆహారం పెట్టడం, వాటికి వ్యాధులు సోకకుండా వ్యాక్సిన్‌లు వేయించడం వంటి సంరక్షణ చర్యలు చేస్తున్నట్లు తెలిపారు. కుక్క ఎంత విశ్వాసంగా ఉంటుందో ఆ కుక్కపై మనుషులకు అంతే ప్రేమ ఉంటుందని నిరూపించారు.

Updated Date - Dec 01 , 2025 | 12:12 AM