Share News

వైద్యుల నిర్లక్ష్యానికి ఇద్దరు బలి..!

ABN , Publish Date - Nov 23 , 2025 | 12:48 AM

గుండె నొప్పి అంటూ ఆసుపత్రికి వెళ్ళిన మహిళ వైద్యుల నిర్లక్షంతో ప్రాణాలు కోల్పో యిన ఘటన తాడేపల్లిగూడెం పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చోటు చేసుకున్నది.

వైద్యుల నిర్లక్ష్యానికి ఇద్దరు బలి..!
కుమారుడిని పట్టుకుని రోదిస్తున్న శ్రావణి భర్త..

తాడేపల్లిగూడెం ప్రైవేటు ఆస్పత్రి వద్ద ఉద్యోగుల ఆందోళన

తాడేపల్లిగూడెం రూరల్‌, నవంబరు 22(ఆంధ్రజ్యోతి):గుండె నొప్పి అంటూ ఆసుపత్రికి వెళ్ళిన మహిళ వైద్యుల నిర్లక్షంతో ప్రాణాలు కోల్పో యిన ఘటన తాడేపల్లిగూడెం పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చోటు చేసుకున్నది. మృతురాలి బంధువులు తెలిపిన వివరాలివి. తాడేపల్లిగూడెం మున్సిపల్‌ కార్యాలయంలో సంచర్ల శ్రావణి(35) శనివారం ఉదయం విధు లకు హాజరైంది. తనకు గుండె నొప్పి వస్తుందని తాడేపల్లిగూడెంలో గుండె కు సంబందించిన వైద్యం అందించే ఆసుపత్రికి వెళ్లింది. ఉదయం 11 గం టలకు వెళ్లిన ఆమెకు వైద్యులు గ్యాస్‌ సమస్య అంటూ వైద్యం మొదలు పెట్టారు. చికిత్స చేస్తుండగా శ్రావణి అపస్మారక స్థితికి చేరుకున్నది. దీంతో వైద్యులు కంగారు పడి శ్రావణి కుటుంబ సభ్యులతో రూ.40 వేలు ఖరీదు చేసే ఇంజక్షన్‌ చివరి నిమిషంలో అందించినా ఉపయోగం లేకుండా పోయింది. ఆమె మృతి చెందిందంటూ వైద్యులు చెప్పడంతో శ్రావణి బంధువులు, మున్సిపల్‌ సిబ్బంది ఒక్కసారిగా ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి వద్ద నిరసన తెలిపారు. సకాలంలో ఆసుపత్రికి వచ్చినా వైద్యుల నిర్లక్షం కారణంగా ప్రాణాలను నిలబెట్టలేక పోయారని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. కుమారుడు వర్షిత్‌ను పట్టుకుని శ్రావణి భర్త రోదిస్తున్న తీరు చూపరులను కలచివేసింది.

నరసాపురంలో హైవేపై బంధువుల ఆందోళన

నరసాపురం, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వాసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో వ్యక్తి మృతి చెందాడని ఆరోపిస్తూ శనివారం బంధువులు 216 హైవే రోడ్డుపై ఆందోళన చేపట్టారు. మొగల్తూరుకు చెందిన ఫణీంద్ర(21) శనివారం మధ్యాహ్నం పాలకొల్లు రోడ్‌లోని ఇసుక ర్యాంపు వద్ద బోలేరో వాహనం ఢీకొట్టడంతో గాయాలపాలయ్యాడు. బంధువులు వెంటనే నరసా పురం ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. ఆస్పత్రి వైద్య సిబ్బంది సరిగ్గా పట్టిం చుకోకపోవడంతో భీమవరం తీసుకెళ్లారు. మార్గమఽధ్యలో ఫణీంద్ర మృతి చెందాడు. దీంతో మృతదేహంతో ఆస్పత్రికి తీసుకొచ్చి కొద్దిసేపు ఆందోళన చేపట్టారు. 216 రహదారిపై బంధువులతో కలిసి ఆందోళన చేపట్టారు. గంటపాటు ఆందోళన చేయడంతో నరసాపురం–మొగల్తూరు రోడ్‌లో పెద్ద ఎత్తున ట్రాఫిక్‌ జామ్‌ అయింది. సీఐ దుర్గాప్రసాద్‌, ఎస్సై జయలక్ష్మి ఆందో ళనకారుల వద్దకు వచ్చారు. విప్‌, ఎమ్మెల్యే నాయకర్‌ ఘటనా స్థలానికి వచ్చారు. జరిగిన విషయాన్ని మృతుడి బంధువుల నుంచి ఆరా తీశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన బాఽధ్యులపై చర్యలు తీసు కుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించడంతో ట్రాఫిక్‌ క్లియర్‌ అయింది. ఎస్సై జయలక్ష్మి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Updated Date - Nov 23 , 2025 | 12:48 AM