డాక్టర్ జాన్ అమృతం డీఎంహెచ్‌వోగా బాధ్యతలు
ABN , Publish Date - Jul 11 , 2025 | 12:44 AM
డీఎంహెచ్‌వోగా బదిలీపై జిల్లాకు ఇటీవల నియ మితులైన డాక్టర్ పి.జాన్ అమృతం గురువారం ఏలూరులోని జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి కార్యాలయంలో విధుల్లో చేరారు.
శాఖా పరంగా ఎన్నో సవాళ్లు
వర్క్ అడ్జస్ట్‌మెంట్ తొలిటాస్క్
అడ్డగోలు డిప్యుటేషన్లపై ఏ నిర్ణయం తీసుకుంటారో..!
వైద్య ఆరోగ్యశాఖ ప్రక్షాళన తప్పనిసరి
ఏలూరు అర్బన్, జూలై10(ఆంధ్రజ్యోతి): డీఎంహెచ్‌వోగా బదిలీపై జిల్లాకు ఇటీవల నియ మితులైన డాక్టర్ పి.జాన్ అమృతం గురువారం ఏలూరులోని జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి కార్యాలయంలో విధుల్లో చేరారు. ఇప్పటివరకు డీఎంహెచ్‌వోగా పనిచేసిన డాక్టర్ మాలిని బదిలీపై గుంటూరు నగర పాలకసంస్థ మెడికల్ అండ్ హెల్తాఫీసర్‌గా బదిలీ అయిన విషయం విదితమే. కొత్తగా డీఎంహెచ్‌వో బాధ్యతలు చేపట్టిన డాక్టర్ పి.జే.అమృతంకు వైద్యశాఖలోని పలు విభాగాల అధికారులు, ఉద్యోగులు పుష్ప గుచ్చాలతో శుభాకాంక్షలు తెలిపారు.
తొలి టాస్క్ కీలకమే..
బాధ్యతలు స్వీకరించిన వెంటనే ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ నిర్వహించిన జూమ్ మీటింగ్‌లో డీఎంహెచ్‌వో పాల్గొన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదా వరి జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న ఎంపీహెచ్‌ఏ (మేల్) ఉద్యోగుల సేవలను మలేరియా, డెంగీ ప్రభావిత ప్రాంతా ల్లో పని సర్దుబాటు (వర్క్ అడ్జస్ట్‌మెంట్)పై విని యోగించుకునేలా ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శ కాల మేరకు కౌన్సెలింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని డీఎంహెచ్‌వోను ఆదేశించారు. ఆ మేరకు ఈ ఏడాది ఏప్రిల్ 16నే జీవో విడు దల చేయగా, రాష్ట్రంలో పలు జిల్లాల్లో కౌన్సెలింగ్ ఇప్పటికే పూర్తికాగా, ఉమ్మడి జిల్లా వైద్యఆరోగ్య శాఖ ఇంతవరకు చేపట్టలేదు. గత మేలో ఒకసారి కౌన్సెలింగ్ జరపడానికి కార్యాచరణను ప్రకటిం చినా సీనియార్టీ జాబితాల్లో తప్పులు దొర్లాయన్న ఆరోపణలతో నిలిపివేశారు. ఈలోగా వర్షాకాలం రావడంతో మళ్లీ ప్రతిపాదనలు తెర పైకి వచ్చాయి. ఈ క్రమంలోనే కీటకజనిత వ్యాధుల వ్యాప్తి నియంత్రణ కార్యక్రమాన్ని (ఎన్ వీబీడీసీపీ) అమలు చేయడానికి ఎంపీహెచ్‌ఏ (మేల్) ఉద్యోగులను వర్క్ అడ్జస్ట్‌మెంట్‌పై నియమించడానికి కొత్త డీఎంహెచ్‌వో కార్యా చరణను ప్రారంభించాల్సి ఉంది.
అడ్డగోలు డిప్యుటేషన్లు..
వైద్య ఆరోగ్యశాఖలోని అన్ని కేడర్ల ఉద్యోగు లకు జిల్లాస్థాయిలో, పీహెచ్‌సీల మెడికల్ ఆఫీ సర్లకు రాష్ట్రస్థాయిలో కొద్దిరోజుల క్రితమే సాధా రణ బదిలీలు జరిగాయి. మరోవైపు బదిలీల కౌన్సెలింగ్ ముగిసిన రోజుల వ్యవధిలోనే జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో నిబంధనలకు విరుద్ధంగా డిప్యుటేషన్ల పర్వం మొదలైంది. ముఖ్యంగా డీఎంహెచ్‌వో కార్యాలయానికి వివిధ పీహెచ్‌సీల నుంచి డిప్యుటేషన్లను పలువురికి ఇష్టానుసారం జారీ చేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నా ఇవి ఆగలేదు. డిప్యుటేషన్ల ఆర్డర్లను పీహెచ్‌సీలు, డీఎంహెచ్‌వో కార్యాలయ సెక్షన్లకు ఈ–మెయిల్ లో పొందుపర్చకుండా వ్యక్తిగతంగా జారీ చేయ డం గమనార్హం. దీంతో డిప్యుటేషన్ల వ్యవహారం బహిరంగంగా తెలుసుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. ఇటీవల బదిలీ అయిన పలువురు సీనియర్ అసిస్టెంట్లు, ఎంపీహెచ్‌ఈ వోలు మళ్లీ డీఎంహెచ్‌వో కార్యాలయానికి డిప్యు టేషన్ ఉత్తర్వులను పొందగా, స్టేట్‌కేడర్ పోస్టు లైన పీహెచ్‌సీల మెడికల్ ఆఫీసర్లలో పలువురికి జిల్లాస్థాయిలోనే డిప్యుటేషన్లు ఎడాపెడా ఇచ్చేసి నట్టు తెలిసింది. వాస్తవానికి జిల్లా నుంచి బదిలీ అయిన అధికారులకు డిప్యుటేషన్లు, కీలక నిర్ణ యాలు తీసుకునే అధికారం ఉండవని, ఒకవేళ అవసరమనుకుంటే రాష్ట్ర ఉన్నతాధికారుల అను మతి పొందాలి. ఈ నేపథ్యంలో డిప్యుటేషన్లు, ఏఎన్‌ఎంల బదిలీల్లో చోటుచేసుకున్న ఆరోపణ లపై కొత్త డీఎంహెచ్‌వో సమీక్ష చేసి, ప్రక్షాళనపై దృష్టి సారించాల్సి ఉంది.
––––––––––––––––––––––––––