దిత్వా గుబులు
ABN , Publish Date - Dec 01 , 2025 | 12:15 AM
జిల్లాలో వరి కోతలు ముమ్మరంగా జరుగు తున్నాయి. ఈ సమయంలో భారీగా వర్షాలు కురిస్తే వరి పంట దెబ్బతింటుందన్న ఆందోళన రైతులు ఆందోళన చెందుతున్నారు.
జిల్లాలో కురుస్తున్న వర్షాలు
రైతుల్లో ఆందోళన
99,453 ఎకరాల్లో కోతలు పూర్తి
ఏలూరుసిటీ, నవంబరు 30(ఆంధ్ర జ్యోతి): జిల్లాలో వరి కోతలు ముమ్మరంగా జరుగు తున్నాయి. ఈ సమయంలో భారీగా వర్షాలు కురిస్తే వరి పంట దెబ్బతింటుందన్న ఆందోళన రైతులు ఆందోళన చెందుతున్నారు. దిత్వా తు ఫాన్ ఎఫెక్ట్‌తో జిల్లా వ్యాప్తంగా వర్షాలు ప్రారం భం కావడంతో రైతుల్లో గుబులు మొదలైంది. కోసిన వరి పంటను రక్షించుకోవడానికి కల్లాల్లో కుప్పలు వేసి బరకాలు కప్పుతున్నారు. బయట ఆరబోసిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాల్లో నిల్వ చేసుకుంటున్నారు. దిత్వా తుఫాన్ కారణంగా జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ ముం దస్తుగానే హెచ్చరికలు జారీ చేసింది. అయితే తుఫాన్ దిశ మార్చుకుంటుందని సామాజిక మాధ్యమాల్లో సమాచారం వస్తుం డటంతో రైతులు ఈ ప్రాంతంలో సోమవారం నుంచి వర్షాలు ఏ విధంగా కురుస్తాయోనన్న ఆందోళ న వ్యక్తం అవుతోంది. దిత్వా తుఫాన్ ప్రభావం తో ఏపీకి ఐఎండీ బిగ్ అలెర్ట్‌ను జారీ చేసింది. దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినా ఆది, సోమవారాల్లో ఏలూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
వర్షాలు కురిస్తే నష్టమే..
జిల్లాలో సార్వాసాగులో భాగంగా ఇప్పటి వరకు 99,453 ఎకరాల్వో వరి కోతలు పూర్త య్యాయి. జిల్లాలో ఇంకా 1,07,833 ఎకరాల్లో వరి కోతలు పూర్తి కావాల్సి ఉంది. అయితే కోసిన వరి పంట కొంతవరకు కల్లాల్లోనే ఉంది. ధాన్యం తడిస్తే తేమశాతం పెరిగిపోతుందని, దీనివల్ల ఆర్ధికంగా నష్టపోవాల్సి వస్తుందని రైతులు పేర్కొంటున్నారు. తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉంటే జిల్లాలో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది.