కాల్వలు, డ్రెయిన్లు శుభ్రం చేయండి
ABN , Publish Date - Jun 07 , 2025 | 12:17 AM
జిల్లాలోని కాలువలు, డ్రెయిన్ల నిర్వహణ పనులను అత్యంత నాణ్యతతో చేపట్టాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు.
పూడిక తీత, గట్ల పటిష్టతకు రూ.25.66 కోట్లు
సకాలంలో పనులు పూర్తి కావాలి : కలెక్టర్
భీమవరం రూరల్, జూన్ 6 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని కాలువలు, డ్రెయిన్ల నిర్వహణ పనులను అత్యంత నాణ్యతతో చేపట్టాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. జిల్లాకు మంజూరైన ఇరిగేషన్ ఓ అండ్ ఎం పనుల నిర్వహణపై జలవనరుల శాఖ అధికారులతో కలెక్టర్ శుక్రవారం సమీక్షించారు. డ్రెయిన్లు, కాలువల్లో తూడు తొలగిం పు, పూడికతీత పనులకు, గట్లను పటిష్టపరిచేందుకు కాలువలకు సంబంధించి రూ.13.66 కోట్లు, డ్రెయిన్స్‌కు సంబంధించి రూ. 12 కోట్లు మంజూరు చేయడం జరి గిందన్నారు. సాగు, తాగునీటి ఇబ్బంది లేకుండా పనులను పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు. భీమవరంలోని ప్రధాన కాలువలో పేరుకుపోతున్న చెత్తను 15 రోజులకొకసారి తొలగించాలని ఆదేశించారు. ఉప్పుడేరు డ్రెడ్జింగ్ పనులకు రూ.6 కోట్లు, రూ.3 కోట్లు రెండు ప్యాకేజీల కింద మొ త్తం రూ.9 కోట్లు మంజూరయ్యాయని, టెండర్స్ పిలవడం జరిగిందన్నారు. సమావేశంలో ఈఈ పి.సుబ్రహ్మణ్యేశ్వరరావు, డ్రెయిన్ల శాఖ ఈఈ సీహెచ్.సత్యనారాయణ, డీఈలు కె.శ్రీనివాస్, కె.ధర్మజ్యోతి, సీహెచ్.వెంకట నారాయణ, డీఎన్‌వీవీఎస్.మూర్తి, ఏఈ వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
పీహెచ్‌సీల్లో సేంద్రియ ఉత్పత్తులు
భీమవరం టౌన్, జూన్ 6 (ఆంధ్రజ్యోతి): పీ హెచ్‌సీలో రోగులకు నాణ్యమైన ఆహారం అందే విధంగా సేంద్రియ ఉత్పత్తులను అందుబాటులో ఉంచాలని, వారంలో ఒకరోజు విక్రయ స్టాల్ ఏర్పా టు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ చర్చించారు. తెలి పారు. పీహెచ్‌సీలో రోగుల ఆరోగ్యాన్ని మెరుగుపర చడానికి రసాయన రహిత సహజ ఆహారం మేలు అన్నారు. భీమవరం ఏరియా హాస్పిటల్‌లో స్టాల్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతు ఉత్పత్తులు నిల్వ చేసేందుకు గోడౌన్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సమావేశంలో జిల్లా సహకార అధికారి ఎం.నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.