బుట్టాయగూడెం ఎంపీపీపై అవిశ్వాసం
ABN , Publish Date - Nov 26 , 2025 | 01:03 AM
బుట్టాయ గూడెం వైసీపీ ఎంపీపీ కారం శాంతిపై సొంత పార్టీ నేతలే అవిశ్వాసం ప్రకటించారు. సభ్యుల నిర్ణయంతో ఆర్డీవో ఎం వి.రమణ బుధవారం మండల పరిషత్ సమావేశ మంది రంలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
నేడు ప్రత్యేక సమావేశం
బుట్టాయగూడెం, నవంబరు 25(ఆంధ్రజ్యోతి):బుట్టాయ గూడెం వైసీపీ ఎంపీపీ కారం శాంతిపై సొంత పార్టీ నేతలే అవిశ్వాసం ప్రకటించారు. సభ్యుల నిర్ణయంతో ఆర్డీవో ఎం వి.రమణ బుధవారం మండల పరిషత్ సమావేశ మంది రంలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మండలంలో 15 మంది ఎంపీటీసీ సభ్యులు ఉండగా ఇద్దరు సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ, ఒకరు టీడీపీకి చెందిన సభ్యులు ఉన్నారు. మిగిలిన 12 మంది వైసీపీ సభ్యులే. సభ్యుల నిర్ణ యంతో ఎంపీపీ శాంతి పదవి పోవడం ఖాయమని నేతలు విశ్లేషిస్తున్నారు. తదుపరి ఎంపీపీ ఎవరనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఎంపీపీ పీఠంపై పలువురు సభ్యులు ఆశ పడుతున్నట్లు సమాచారం. ప్రభుత్వం మారిన వెంటనే ఎంపీపీపై అవిశ్వాస తీర్మానం పెట్టి పదవి నుంచి దించివే యాలని వైసీపీ వారు భావించినా నాలుగేళ్లు పూర్తికాకుండా అవిశ్వాస తీర్మానం పెట్టడానికి అవకాశం లేకపోవడంతో ఇప్పటికి అవకాశం వచ్చింది.
ఎంపీపీ భర్త తీరుపై విగిసిపోయి..
వైసీపీకి చెందిన ఎంపీపీ శాంతిపై సొంత పార్టీ సభ్యులే అవిశ్వాసం ప్రకటించడానికి ప్రధాన కారణం ఆమె భర్తే అనే వాదన వినిపిస్తోంది. పేరుకు మాత్రమే ఆమె ఎంపీపీ అని.. ఆమె భర్తే పెత్తనం చేస్తుంటారని సభ్యులు గుర్రుగా ఉన్నారు. ఎంపీటీసీ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకో కుండా తాను అనుకున్నదే చేస్తుంటాడని, అభివృద్ధి పనుల వివరాలను చెప్పకుండా ఒక్కడే నిర్ణయాలు చేస్తుంటాడని, పద్ధతి మార్చుకోవాలని చెప్పినా వినకపోవడంతో అవిశ్వాస తీర్మానం పెట్టడానికి సిద్ధపడినట్లు కొందరు వైసీపీ ఎంపీ టీసీలు చెబుతున్నారు. ఈ నెల 13న అధికారులకు అవిశ్వాసం నోటీసు అందజేశారు. మొత్తం 15 మందిలో 12 మంది వైసీపీ ఎంపీటీసీ సభ్యులే. ఎంపీపీ కాకుండా మిగి లిన 11 మందిలో ఆరుగురు మహిళలు, ఐదుగురు పురుషులు. మహిళకు రిజర్వు కావడంతో బుట్టాయగూడెం, సీతప్ప గూడెం, రెడ్డిగణవరం, లక్ష్ముడుగూడెం ఎంపీటీసీలు ఎంపీపీ పదవి ఆశిస్తున్నట్లు సమాచారం. సంఖ్యాబలం లేకపోవ డంతో ఇతర పార్టీలు ఎంపీపీ పదవిపై ఆశ పెట్టుకున్నట్లు లేదు. ప్రస్తుతానికి అవిశ్వాసం తీర్మానంపై చర్చ మాత్రమే జరుగుతుండగా ఎంపీపీ పదవికి ఎన్నిక జరగడానికి సమ యం ఉన్నందున ఎటువంటి మార్పులు చేర్పులు జరుగుతాయో వేచిచూడాలి.