శ్రీవారి భక్తులకు డిజిటల్ సేవలు
ABN , Publish Date - Dec 01 , 2025 | 12:11 AM
రాష్ట్రంలోని అన్ని దేవాల యాల్లో భక్తుల సౌకర్యార్థం డిజిటల్ సేవలు మరింత అందుబాటులోకి తేవాలని దేవదాయ ధర్మదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ నిర్ణయించారు.
ద్వారకాతిరుమల, నవంబరు30 (ఆంధ్రజ్యోతి) :రాష్ట్రంలోని అన్ని దేవాల యాల్లో భక్తుల సౌకర్యార్థం డిజిటల్ సేవలు మరింత అందుబాటులోకి తేవాలని దేవదాయ ధర్మదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ నిర్ణయించారు. ఇటీవల జరిగిన సమా వేశంలో అన్ని దేవాలయ ఈవోలకు ఈమేరకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో చినవెంకన్న ఆలయంలో ఈ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు దృష్టి సారించారు. సులభతర దర్శనం, ఇతర సేవలు భక్తులకు మరింత సౌకర్యవంతంగా అందించేందుకు ఈ సేవలు ఉపయోగపడతాయని ఈవో ఎన్వీ సత్యనారాయణమూర్తి తెలిపారు.
అందుబాటులో సేవలు ఇలా..
భక్తులు దేవస్థానం అధికారిక వెబ్‌సైట్ లేదా వాట్సాప్ ద్వారా ఈ దిగువ సేవలను బుకింగ్ చేసుకోవచ్చని ప్రకటించారు.
దర్శనములు(శీఘ్ర దర్శనం, ప్రత్యేక దర్శనం).
సేవలు (ఆర్జిత సేవలు) జూ వసతి (అద్దె గదులు)
డొనేషన్లు(విరాళాలు) జూ కేశఖండన టికెట్లు జూ ప్రసాదాలు
బుకింగ్ విధానం, నిబంధనలు..
వెబ్‌సైట్ : దేవాలయాల అఽధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
వాట్సాప్ : 95523 00009 అనే నంబర్‌కు మెసేజ్ చేయడం ద్వారా టికెట్లను బుక్ చేసుకోవచ్చు.
గుర్తింపు కార్డు తప్పనిసరి..
ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న భక్తులు తమ ఆధార్ కార్డు లేదా ఇతర గుర్తింపు కార్డు వివరాలను కౌంటర్‌లో పరిశీలనకు తప్పనిసరిగా సమర్పించాలి. ఆన్‌లైన్ బుకింగ్ చేసుకున్న భక్తుల కోసం ప్రత్యేక క్యూలైను ఏర్పాటు చేశామని ఆలయ ఈవో మూర్తి తెలిపారు. భక్తులు శ్రీవారి దర్శనం, సేవలు, ప్రసాదాలు, వసతి, కేశఖండన కోసం ఆన్‌లైన్ సేవలు వినియోగించాలని కోరారు.