Share News

ఆర్టీసీ బంకు స్కామ్‌పై సమగ్ర విచారణ చేయాలి

ABN , Publish Date - Nov 22 , 2025 | 01:03 AM

ఆర్టీసీ పెట్రోల్‌ బంకులో స్కామ్‌కు సంబంధం లేని ఉద్యోగులకు ఇచ్చిన సస్పెన్షన్‌ ఆర్డర్‌ను వెనక్కి తీసుకోవాలి.

ఆర్టీసీ బంకు స్కామ్‌పై సమగ్ర విచారణ చేయాలి
గ్యారేజ్‌ వద్ద ధర్నా చేస్తున్న ఆర్టీసీ నాయకులు, సిబ్బంది

ఏపీ పీటీడీ ఎంప్లాయీస్‌ అధ్యక్షుడు దామోదరావు డిమాండ్‌

ఏలూరు,నవంబరు 21(ఆంధ్రజ్యోతి):‘ఆర్టీసీ పెట్రోల్‌ బంకులో స్కామ్‌కు సంబంధం లేని ఉద్యోగులకు ఇచ్చిన సస్పెన్షన్‌ ఆర్డర్‌ను వెనక్కి తీసుకోవాలి. అధికారులకు ఒక న్యాయం, ఉ ద్యోగులకు ఒక న్యాయం పాటించడం సమం జసంగా లేదు’ అని ఏపీ పీటీడీ(ఆర్టీసీ) ఎం ప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదరావు ఆరోపించారు. నగరం లోని కపర్థీ భవన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మా ట్లాడుతూ ‘2021లో ఏర్పాటైన ఈ బంకు నిర్వ హణలో సరైన పర్యవేక్షణ లేదు. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులపై బాధ్యతలు ఉంచిన కారణంగానే రూ.83 లక్షలు అవకతవకలు జరిగాయని ఆర్టీసీ ఉన్నతాధికారులు నిర్ధారించారు. వాస్త వాలను వెలుగుచూసేలా పోలీసులకు ఫిర్యా దు ఇచ్చి బాధ్యులపై చర్యలు తీసుకోలేదు. ఉన్నతాధికారుల జోక్యం చేసుకుని ఈ డబ్బు లను సంబంధిత సెక్షన్‌లో పనిచేసే సిబ్బం దితో పాటు నలుగురు జూనియర్‌ స్కేల్‌ అధికారులతో కలిసి మొత్తం తొమ్మిది మంది తో రూ.50 లక్షలను కట్టించి వారిని తప్పించా రు. డబ్బులు కట్టమని మరో నలుగురిని ఒత్తి డి చేయగా చేయని తప్పుకు డబ్బులు ఎందు కు కట్టాలని వారు ప్రశ్నించడంతో అన్యాయం గా ఆ నలుగురిని సస్పెండ్‌ చేశారు. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి ఎవరు తప్పు చేశారో పోలీస్‌ అధికారులు నిర్ధారించాకే బాధ్యులపై చర్యలుండాలి. లేకపోతే దీనిపై ఉద్యమిస్తాం’ అని ఆయన స్పష్టం చేశారు.

ఆర్టీసీ డిపో ముందు ధర్నా

అక్రమంగా నలుగురు ఉద్యోగులను బలి చేశారని, దోషులు ఎవరనేది తేల్చకుండా చర్యలు సరికాదని వ్యతిరేకిస్తూ ఏలూరు డిపో కార్యాలయం వద్ద వివిధ యూనియన్ల ఆధ్వ ర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈయూ ఏలూరు డిపో గౌరవాఽధ్యక్షుడు వై.శ్రీనివాసరావు మాట్లాడుతూ అధికారులకు ఒక న్యాయం, కిందిస్థాయి ఉద్యోగులకు ఒక న్యాయం చేస్తున్నారని, బంకులో జరిగిన అక్ర మాలపై జ్యుడిషియల్‌ ఎంక్వైరీ నిర్వహించా లని డిమాండ్‌ చేశారు. అక్రమ సస్పెన్లను ఎత్తివేయక పోతే ఆందోళనలు ఉధృతం చేసా ్తమన్నారు. ఈయూ విజయవాడ జోన్‌ కార్య దర్శి వై.శ్రీనివాసరావు, డిపో కార్యదర్శి డి. ఆంజనేయులు, స్టాప్‌ వర్కర్సు ఫెడరేషన్‌ డిపో కార్యదర్శి ఎ.రమేష్‌, టి.బాబూ రావు, పి.రాజు, బాబూరావు పాల్గొన్నారు.

Updated Date - Nov 22 , 2025 | 01:04 AM